ఉద్యోగం చేస్తూ సర్టిఫికెట్‌ కోర్సులు

బీబీఎం డిగ్రీలో మీరు ఏ స్పెషలైజేషన్‌ చదివారో చెప్పలేదు. మీరు చదివిన స్పెషలైజేషన్‌, ఏ కంపెనీలో పని చేయాలనుకొంటున్నారో అన్న అంశాలను బట్టి...

Updated : 04 Jan 2023 05:10 IST

బీబీఎం డిగ్రీ చేశాను. తర్వాత ఎంబీఏ చదవాలని లేదు. ఉద్యోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంచుకునే సర్టిఫికెట్‌ కోర్సులున్నాయా?.

వాసన్‌

బీబీఎం డిగ్రీలో మీరు ఏ స్పెషలైజేషన్‌ చదివారో చెప్పలేదు. మీరు చదివిన స్పెషలైజేషన్‌, ఏ కంపెనీలో పని చేయాలనుకొంటున్నారో అన్న అంశాలను బట్టి ఎలాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేయాలో నిర్ణయించుకోండి. మీరు మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉంటే డిజిటల్‌ మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, అడ్వర్‌టైజింగ్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌, బ్రాండింగ్‌ మేనేజ్‌మెంట్‌, సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ ఎనలిటిక్స్‌, మార్కెటింగ్‌ రిసెర్చ్‌ల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. ఫైనాన్స్‌ రంగంలో ఉద్యోగం చేస్తూవుంటే, క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్‌, ఫిన్‌ టెక్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్సియల్‌ మార్కెట్స్‌, కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌ ఎనలిటిక్స్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేసుకోవచ్చు. హెచ్‌ఆర్‌ రంగంలో హెచ్‌ఆర్‌ లీడర్‌ షిప్‌, స్ట్రాటజిక్‌ హెచ్‌ఆర్‌ఎం, టాలెంట్‌ హెచ్‌ఆర్‌ఎం, రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ట్రెయినింగ్‌, హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌ల గురించి కూడా ఆలోచించవచ్చు. ఆపరేషన్స్‌ రంగానికొస్తే, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, సోర్సింగ్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, సిక్స్‌ సిగ్మా, సర్వీస్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, సప్లై చెయిన్‌ ఎనలిటిక్స్‌ల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని