Published : 05 Jan 2023 00:19 IST

ఏ కోర్సులు చేస్తే మేలు?

ఈ ఏడాది ఎంకాం పూర్తిచేశాను. ప్రైవేటు బ్యాంకులోగానీ సాఫ్ట్‌వేర్‌ రంగంలోగానీ ఉద్యోగం చేయాలనుంది. ఇందుకు ఉపయోగపడే కోర్సులు ఏవి?  

 దినేష్‌

* ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగానికి మీ ఎంకాం విద్యార్హత సరిపోతుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేయాలంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన కోర్సులు నేర్చుకోవాలి. సాధారణంగా ఎంకాం చదివినవారికి ప్రైవేటు బ్యాంకుల్లో అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, కస్టమర్‌ ఎగ్జిక్యూటివ్‌, ఇన్సూరెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. జీతంతో సంబంధం లేకుండా ఏదో ఒక ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం మొదలుపెట్టండి. కొంత అనుభవం పొందాక పెద్ద బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ లాంటి కోర్సులు చేసి మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోండి.


ఎంకాం చదివినవారికి ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ కొలువులకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు.


ఇక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల విషయానికొస్తే బిజినెస్‌ ఎనలిటిక్స్‌, ఈఆర్‌పీ, ఎస్‌ఏపీ, ఒరాకిల్‌ ఫైనాన్సియల్స్‌ లాంటి కోర్సుల్లో సరైన సంస్థ నుంచి శిక్షణ పొంది ఉద్యోగ ప్రయత్నాలు చేయండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌
      

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు