పీజీ కోర్సులు ఏమున్నాయి?

బీబీఏ తరువాత ఉద్యోగం చేస్తూ మీరు వారాంతపు (ఎగ్జిక్యూటివ్‌) ఎంబీఏ చదివే అవకాశం ఉంది. దూరవిద్య ద్వారా పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి కానీ, వివిధ రాష్ట్ర యూనివర్సిటీల దూరవిద్యా కేంద్రాల ద్వారా కానీ ఎంబీఏ చేయవచ్చు.

Published : 12 Jan 2023 00:12 IST

బీబీఏ పూర్తయింది. ఉద్యోగం చేస్తున్నాను. దూరవిద్య లేదా వారాంతపు తరగతుల ద్వారా చదవగలిగే పీజీ కోర్సులు ఏమేం ఉన్నాయి?

లలిత

* బీబీఏ తరువాత ఉద్యోగం చేస్తూ మీరు వారాంతపు (ఎగ్జిక్యూటివ్‌) ఎంబీఏ చదివే అవకాశం ఉంది. దూరవిద్య ద్వారా పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి కానీ, వివిధ రాష్ట్ర యూనివర్సిటీల దూరవిద్యా కేంద్రాల ద్వారా కానీ ఎంబీఏ చేయవచ్చు. ఓపెన్‌ యూనివర్సిటీల్లో చదవాలనుకుంటే ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీల గురించి ఆలోచించండి.

మూడు సంవత్సరాల ఉద్యోగానుభవం ఉన్నవారు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో వారాంతపు ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చదవొచ్చు. చాలా డీమ్డ్‌ టు బి యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు ఉద్యోగస్తుల కోసం వారాంతపు ఎంబీఏ కోర్సును అందిస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ/ ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌, ప్రైవేటు యూనివర్సిటీలు పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ ఎంబీఏ డిగ్రీని కూడా అందిస్తున్నాయి. సాధారణంగా ఈ కోర్సుల్లో ప్రవేశాలను ప్రత్యేక ప్రవేశపరీక్ష/ ఇంటర్వ్యూ/ డిగ్రీలో పొందిన మార్కులు/ ఐసెట్‌ ర్యాంకు లాంటి పద్ధతుల్లో నిర్వహిస్తారు.

మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్నీ, ఆసక్తినీ బట్టి ఎంబీఏలో స్పెషలైజేషన్‌ ఎంచుకోండి. ఆసక్తి ఉంటే ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీ కూడా చేయొచ్చు. మీరు ఏదైనా కోర్సును ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా చదవాలనుకుంటే ఆయావిద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రభుత్వ/ యూనివర్సిటీ గుర్తింపు ఉందో, లేదో నిర్ధారించుకోండి. గుర్తింపు లేని డిగ్రీలను చేసి మీ విలువైన సమయం, డబ్బు వృథా చేసుకోకండి. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని