సెంట్రల్ వర్సిటీలో సీటు ఎలా?
ఫిజిక్స్ గ్రాడ్యుయేట్‌ని. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చదవాలనుంది. ఇందులో సీటు సంపాదించాలంటే ఏంచేయాలి?
శ్రద్ధ
మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదవాలంటే, ఎన్‌టీఏ నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ ( సీయూఈటీ- పీజీ) రాయాలి. గత సంవత్సరం నుంచే అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో పీజీ అడ్మిషన్ల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్/ మే నెలల్లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. త్వరలో నోటిఫికేషన్ రావొచ్చు. మీరు తరచుగా cuet.nta.nic.in వెబ్‌సైట్ సందర్శిస్తూ.. ఎంట్రన్స్ సమాచారాన్ని తెలుసుకోండి. ఈ పరీక్షలో మీరు సాధించిన మార్కుల ఆధారంగా పీజీ అడ్మిషన్లు నిర్వహిస్తారు. నమూనా కోసం గత సంవత్సరపు ప్రవేశ పరీక్ష పత్రాన్ని పరిశీలించండి. దేశవ్యాప్తంగా పరీక్ష రాసే అభ్యర్థులతో పోటీ పడాలి కాబట్టి, ఇప్పటినుంచే సన్నద్ధం కండి. గత సంవత్సరంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించినప్పటికీ, ప్రవేశాలను యూనివర్సిటీలు విడివిడిగా నిర్వహించుకున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో కేంద్రీకృత కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రవేశ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించి, మీకు నచ్చిన యూనివర్సిటీలను ఆప్షన్లుగా పెట్టుకోండి. సాధారణంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాల్లో రాష్ట్రాల వారీగా రిజర్వేషన్లు ఉండవు. సొంత రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశానికి కూడా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన అభ్యర్థులతో సమానంగా పోటీ పడాలి. ఏదైనా కారణం వల్ల, ఈ విద్యా సంవత్సరానికి కేంద్రీకృత కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు నిర్వహించకపోతే.. మీకు నచ్చిన యూనివర్సిటీలకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bilkis Bano: బిల్కిస్ బానో పిటిషన్.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి
-
India News
Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయండి.. రాహుల్‌గాంధీకి నోటీసులు
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
India News
Amritpal Singh: భారత్ ‘హద్దులు’ దాటిన అమృత్‌పాల్..!