కెమిస్ట్రీ పీజీ చేశాక..

ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాల్లో, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులుగా ఉద్యోగం చేయవచ్చు.

Published : 23 Jan 2023 00:03 IST

ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేశాను. ఈ పీజీతో దేశ విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

ఎన్‌.ప్రసాద్‌

* ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాల్లో, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులుగా ఉద్యోగం చేయవచ్చు. నెట్‌/సెట్‌లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొలువుల కోసం ప్రయత్నించవచ్చు. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ… చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి అర్హత ఉంటుంది. మనదేశంలో పీహెచ్‌డీ, విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసి బోధన/పరిశోధన/పారిశ్రామిక రంగాల్లో అక్కడే స్థిరపడవచ్చు. ఆసక్తి, అవకాశం ఉంటే విదేశాల్లో పీహెచ్‌డీ చేసి మెరుగైన ఉద్యోగాల కోసం విదేశాల్లో, మనదేశంలో ప్రయత్నించవచ్చు. ఎమ్మెస్సీతో విదేశాల్లో పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండవు. ఏవైనా సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేసి ఆ రంగంలో విదేశాల్లో/ మనదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీతో ఫార్మా, బయోటెక్‌ రంగంలో, కేంద్ర పరిశోధన సంస్థల్లో, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లాంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ఎమ్మెస్సీ తరువాత బీఈడీ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం కూడా పోటీపడవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని