విదేశాల్లో పీహెచ్డీ ఎలా?
మా అబ్బాయి ఎమ్మెస్సీ (హ్యూమన్ జెనెటిక్స్) రెండేళ్ల కిందట పూర్తిచేశాడు. పరిశోధన కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడు. జీఆర్ఈ కూడా క్లియర్ చేశాడు. విదేశీ విశ్వవిద్యాలయంలో చేరాలంటే ఏం చేయాలి?
జి.నాగలక్ష్మి
విదేశాల్లో పరిశోధన చేయాలంటే.. అక్కడి యూనివర్సిటీల్లో పీజీ చేసి ఉండటం శ్రేయస్కరం. ముందుగా పరిశోధనా అంశాన్ని, అందుకు తగిన యూనివర్సిటీని, సరైన గైడ్‌ని ఎంచుకోవాలి. విదేశాల్లో అడ్మిషన్ విధానం, పరిశోధన పద్ధతులు మనకంటే భిన్నంగా ఉంటాయి. అక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పర్చుకోవాలి. కనీసం రెండు పరిశోధనా పత్రాలు మంచి జర్నల్స్‌లో ప్రచురించి ఉంటే, మీ అబ్బాయి పీహెచ్డీ అడ్మిషన్ సులువు అవుతుంది. చాలామంది విదేశాల్లో పీజీలో చేరి, రెండో సంవత్సరంలో ఆ పీజీ అడ్మిషన్‌ని పీహెచ్డీ అడ్మిషన్‌గా మార్చుకుంటారు. పరిశోధనలో ముఖ్యమైన విషయం- మనం పరిశోధన చేయాలనుకుంటున్నవారి నమ్మకం పొందటం. ఆ నమ్మకం వ్యక్తిగత పరిచయం, ప్రచురించిన పరిశోధనపత్రాల నాణ్యత, పీజీ చదివిన విశ్వవిద్యాలయ అంతర్జాతీయ ర్యాంకింగ్, ఇక్కడి ప్రొఫెసర్లు ఇచ్చే రికమెండేషన్ లెటర్స్ వల్ల వస్తుంది. అవకాశం ఉంటే మీ అబ్బాయిని మనదేశంలోనే ఏదైనా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో మంచి పరిశోధన నేపథ్యం ఉన్న ప్రొఫెసర్ దగ్గర ప్రాజెక్ట్‌లో చేరి, పరిశోధన మెలకువలను నేర్చుకోమని చెప్పండి. నాణ్యమైన పరిశోధనపత్రాలను ప్రచురించి, విదేశాల్లో మంచి యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశం పొందేలా ప్రోత్సహించండి. అలా కుదరని పక్షంలో ప్రముఖ విదేశీ యూనివర్సిటీలో పీజీ చేయమని చెప్పండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Telangana News: గూగులమ్మకు యూట్యూబ్ కళాకారుల బోనాలు
-
Politics News
Andhra News: నా ఫోన్ కూడా నిఘాలో ఉందనుకుంటున్నా: ఎమ్మెల్సీ విఠపు
-
Ap-top-news News
Andhra News: సీఎం ఓఎస్డీతో కలిసి ప్రయాణించాననడంలో వాస్తవం లేదు: ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి
-
World News
Musharraf: ధోనీ జులపాల జుత్తుకు ముషారఫ్ మెచ్చుకోలు
-
Sports News
Shubman Gill: టిండర్‌లో శుభ్‌మన్ గిల్