యూఎస్‌లో ఎంఎస్‌ కోసం...

యూఎస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్‌ చేయడానికి చాలా యూనివర్సిటీల్లో అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనవి..

Published : 26 Jan 2023 00:10 IST

నా స్టూడెంట్‌ బీటెక్‌ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) చదువుతున్నాడు. యూఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి ఉత్తమ ర్యాంకులున్న యూనివర్సిటీల వివరాలు తెలుపగలరు.

ఎస్‌.నరసయ్య

* యూఎస్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఎంఎస్‌ చేయడానికి చాలా యూనివర్సిటీల్లో అవకాశం ఉంది. అందులో ముఖ్యమైనవి.. స్టాన్‌ఫోర్డ్‌, కొలంబియా, నార్త్‌ ఈస్టర్న్‌, జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజోనా, యూనివర్సిటీ ఆఫ్‌ మియామి, యూనివర్సిటీ ఆఫ్‌ సిన్సినాటి, లారెన్స్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీ, కార్నెగి మెలన్‌ యూనివర్సిటీ, కార్నెల్‌ యూనివర్సిటీ, డ్యూక్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిడ్జ్‌ పోర్ట్‌, స్టీవెన్స్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ. ఈ  విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్‌లకు వెళ్లి కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి. కోర్సు ఫీజు, ఉద్యోగావకాశాలు లాంటి విషయాలను ఆధారంగా చేసుకొని సరైన విశ్వవిద్యాలయాన్ని ఎంచుకోండి. దానికి ముందు అక్కడ చదివిన, చదువుతున్నవారితో మాట్లాడి పూర్తి అవగాహన ఏర్పడ్డాకే నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని