అదనంగా ఏడాది.. సమస్యేనా?

డీఈసీఈ చేశాను. ఈ డిప్లొమా తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరి పూర్తిచేశాను. కానీ రెండో సంవత్సరంలో చేరాలని తర్వాత తెలిసింది.

Updated : 31 Jan 2023 02:13 IST

డీఈసీఈ చేశాను. ఈ డిప్లొమా తర్వాత డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరి పూర్తిచేశాను. కానీ రెండో సంవత్సరంలో చేరాలని తర్వాత తెలిసింది. ఇదేమైనా సమస్య అవుతుందా?

ఎస్‌.చిరంజీవి

సాధారణంగా మూడు సంవత్సరాల డిప్లొమా చేసినవారు డిగ్రీ రెండో సంవత్సరంలో చేరతారు. మీరు డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరడం వల్ల ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాకపోతే డిగ్రీ రెండో సంవత్సరంలో చేరిన మీ సహాధ్యాయుల కంటే ఏడాది ఆలస్యంగా మీరు డిగ్రీని పొందుతారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే- రెండు సంవత్సరాల డిగ్రీ చేసిన వారికంటే మీకు డిగ్రీ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉంటుంది. సరైన అవగాహన లేక సంవత్సరం ఆలస్యంగా డిగ్రీని పొందుతున్నారు కాబట్టి, డిగ్రీ తరువాత సమయం వృథా అవ్వకుండా, తర్వాత ఏం చేయాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోండి. ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా సిద్ధంకండి!

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని