Updated : 02 Feb 2023 00:31 IST

ఎదగటానికి ఏ కోర్సులున్నాయి?

ఎస్‌బీఐలో క్లరికల్‌ క్యాడర్‌లో ఆరేళ్లుగా పనిచేస్తున్నాను. జేఏఐఐబీ, సీఏఐఐబీ పూర్తిచేశాను. సంస్థలో ఎదగడానికి ఉపయోగపడే ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ కోర్సులు ఏవి?

కె.ధనరాజు

మీరు బ్యాంకులో ప్రమోషన్‌కి అవసరమైన కోర్సులను ఇప్పటికే పూర్తిచేశారు కాబట్టి, రెగ్యులర్‌గా మీకొచ్చే పదోన్నతులు అందుబాటులో ఉన్న ఖాళీలను బట్టి వస్తాయి. అలా కాకుండా, మీ బ్యాంకులో కానీ, ఇతర బ్యాంకుల్లో కానీ మెరుగైన ఉద్యోగాలకోసం చార్టెడ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌, ఐఐబీఎఫ్‌ సర్టిఫై చేసిన సర్టిఫైడ్‌ క్రెడిట్‌ ప్రొఫెషనల్‌, ఎస్‌ఎంఈ ఫైనాన్స్‌, ట్రేడ్‌ ఫైనాన్స్‌, ఫారెక్స్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. ఐఐబీఎఫ్‌ నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రెజరీ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల గురించీ ఆలోచించవచ్చు. వీటితోపాటు డిజిటల్‌ బ్యాంకింగ్‌, రిటైల్‌ బ్యాంకింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సు కూడా చేసే అవకాశం ఉంది. ఇవే కాకుండా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ల్లో ఎంబీఏ/ పీజీ డిప్లొమాలను దూరవిద్య/ ఆన్‌లైన్‌ ద్వారా చేయొచ్చు. భవిష్యత్తులో ఏ రంగంలో  స్థిరపడాలని అనుకుంటున్నారో, ఎందులో ఆసక్తి ఉందో అన్న విషయాలను ఆధారం చేసుకొని సరైన కోర్సును ఎంచుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు