పీజీ- పీహెచ్‌డీ.. ఏది మెరుగు?

 ఇతర దేశాల్లో పరిశోధన చేయాలంటే ముందుగా పరిశోధనాంశాన్నీ, అందుకు తగ్గ యూనివర్సిటీనీ, సరైన గైడ్‌నూ ఎంచుకోవాలి.

Updated : 06 Feb 2023 04:44 IST

ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చేసి బయోటెక్‌ కంపెనీలో పనిచేస్తున్నా. విదేశీ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ చేయాలనుంది. విదేశాల్లో ఎంఎస్‌ లేదా పీహెచ్‌డీ రెండింటిలో ఏది చేస్తే మంచిది?

జి.మధులిక

యోటెక్‌ కంపెనీలో మీరు ఏ విభాగంలో పనిచేస్తున్నారో చెప్పలేదు. ఒకవేళ పరిశోధన రంగంలో పనిచేస్తూ కనీసం రెండు నాణ్యతా పరిశోధన పత్రాలు ప్రచురించివుంటే పీహెచ్‌డీ చేసే విషయం గురించి ఆలోచించవచ్చు. అలా కాకపోతే ముందుగా మంచి విదేశీ విశ్వవిద్యాలయంలో పీజీ చేయడానికి ప్రయత్నించండి. ఇతర దేశాల్లో పరిశోధన చేయాలంటే ముందుగా పరిశోధనాంశాన్నీ, అందుకు తగ్గ యూనివర్సిటీనీ, సరైన గైడ్‌నూ ఎంచుకోవాలి. పీజీ చేస్తూనే ఆ పీజీ అడ్మిషన్‌ని పీహెచ్‌డీ అడ్మిషన్‌గా మార్చుకొనే అవకాశం ఉంది. మీరు ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ రంగంలో పీజీ/ పీహెచ్‌డీ చేయాలనుకొంటున్నారు కాబట్టి- విదేశాల్లో ఆ రంగంలో అత్యుత్తమ పరిశోధన ఉన్న యూనివర్సిటీని ఎంచుకొని, అక్కడి ప్రవేశ విధానం తెలుసుకోండి. అంతకంటే ముందు మనదేశంలో ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ రంగంలో పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్లను సంప్రదించి వారి మార్గదర్శకత్వంలో ఏదైనా పరిశోధన ప్రాజెక్టులో చేరటం మంచిది. పరిశోధనకు సంబంధించిన ప్రాధమిక మెలకువల్లో శిక్షణ పొంది విదేశాల్లో పీజీ/ పీహెచ్‌డీ ప్రవేశానికి ప్రయత్నాలు చేయండి.  

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని