విదేశాల్లో స్కాలర్‌షిప్పులు ఎలా?

బీఎస్సీ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదువుతున్నాను. ఇదే సబ్జెక్టులో విదేశాల్లో పీజీ చేయాలని ఉంది. విదేశీ వర్సిటీల్లో భారతీయ విద్యార్థులకు లభించే స్కాలర్‌షిప్పుల వివరాలు చెప్పగలరు.

Updated : 07 Feb 2023 06:37 IST

బీఎస్సీ క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదువుతున్నాను. ఇదే సబ్జెక్టులో విదేశాల్లో పీజీ చేయాలని ఉంది. విదేశీ వర్సిటీల్లో భారతీయ విద్యార్థులకు లభించే స్కాలర్‌షిప్పుల వివరాలు చెప్పగలరు. 

మనోజ్‌

విదేశాల్లో క్రిమినాలజీ అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌లో పీజీ చేయాలనుకోవడం మంచి ఆలోచన. ఇటీవలికాలంలో చాలా విదేశీ యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. మనదేశం నుంచి విదేశాల్లో పీజీ చేస్తున్నవారిలో దాదాపు 90 శాతం మందికి పైగా స్కాలర్‌షిప్‌లు లేకుండానే అడ్మిషన్‌లు పొందుతున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత రెండో సెమిస్టర్‌ నుంచి ఏదో ఒకరకమైన ఆర్థిక సహాయాన్ని పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి సెమిస్టర్లో కనీసం 3 జీపీఏ సాధిస్తే స్కాలర్‌షిప్‌/ అసిస్టెన్స్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. విదేశీ యూనివర్సిటీల్లో, ప్రత్యేకించి భారతీయ విద్యార్ధులకంటూ స్కాలర్‌ షిప్‌లు అందుబాటులో ఉండవు. ప్రతిభ ఉన్న విదేశీ విద్యార్ధులకు స్కాలర్‌ షిప్‌లు లభిస్తాయి. అలాకాకుండా మనదేశం నుంచి ప్రముఖ విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందినవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఛారిటబుల్‌ ట్రస్ట్‌లు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. వాటిలో నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌, జేఎన్‌ టాటా ఎండోమెంట్‌, ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ ముఖ్యమైనవి.

విదేశాల్లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ పీజీ కోర్సుల విషయానికొస్తే- జాన్‌ జేె కాలేజ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ జస్టిస్‌, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సెంట్రల్‌ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్‌ స్ప్రింగ్‌ ఫీల్డ్‌, సామ్‌ హోస్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, వెస్ట్‌ వర్జీనియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ హావెన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా డేవిస్‌, యూనివర్సిటీ పిట్స్‌బర్గ్‌, సదరన్‌ ఇలినాయిస్‌ యూనివర్సిటీల్లో చదివేవారికి మెరిట్‌ స్కాలర్‌షిప్‌లను సంబంధిత విశ్వవిద్యాలయాలు అందిస్తాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని