బయోటెక్ పీజీతో ఏ అవకాశాలు?
బయో టెక్నాలజీలో పీజీ చేయాలనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ యూనివర్సిటీల్లో ఈ కోర్సు ఉంది? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగావకాశాలుంటాయి.
బయో టెక్నాలజీలో పీజీ చేయాలనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏ యూనివర్సిటీల్లో ఈ కోర్సు ఉంది? ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ ఉద్యోగావకాశాలుంటాయి.
గణేష్
బయోటెక్నాలజీలో పీజీ కోర్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రైవేటు కళాశాలల్లో ఉంది. తెలంగాణలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ/ అనంతపురం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సు చదివే అవకాశం ఉంది. బయోటెక్ పీజీ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధన సంస్థల్లో ఉపాధి లభిస్తుంది. సీడ్, బయోటెక్ కంపెనీలు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, ఫుడ్ పరిశ్రమలు, బయో ప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్ కంపెనీలు, ఎన్విరాన్‌మెంటల్ రిసెర్చ్ సంస్థల్లో, బోధన రంగంలో ఉద్యోగావకాశాలుంటాయి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు