బీఈడీ శిక్షణ పొందాలంటే..

ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చదివాను. రెగ్యులర్‌గా బీఈడీ చేయాలనుంది. ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశ, ఫీజు వివరాలు తెలుపగలరు.

Updated : 09 Feb 2023 06:45 IST

ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ చదివాను. రెగ్యులర్‌గా బీఈడీ చేయాలనుంది. ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశ, ఫీజు వివరాలు తెలుపగలరు.

జ్యోతి

మీరు ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివినా కూడా రెగ్యులర్‌గా బీఈడీ కోర్సు చేసే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెగ్యులర్‌గా బీఈడీ చేయాలంటే ఆయా రాష్ట్రాలు నిర్వహించే ఎడ్‌సెట్‌ రాయాలి. ఆ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో బీఈడీ చేయాలంటే, ఎంట్రెన్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ఉండాలి. ఇక ఫీజు విషయానికొస్తే- ప్రభుత్వ కళాశాలల్లో సంవత్సరానికి రూ.10,000 లోపే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ప్రవేశపరీక్షలో మంచి ర్యాంకు రానందున ప్రైవేటు కళాశాలలో సీటు వస్తే, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ అవకాశం ఉందేమో కనుక్కోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు