డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రవేశం ఎలా?

బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివి అకౌంట్స్‌ సెక్షన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేయాలంటే ఏ కోర్సులు చదవాలి.

Updated : 13 Feb 2023 04:15 IST

బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) చదివి అకౌంట్స్‌ సెక్షన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేయాలంటే ఏ కోర్సులు చదవాలి. అలాగే ఏ సబ్జెక్టుతో పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు బాగుంటాయి?

కె.పవన్‌కుమార్‌

డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగం పొందాలంటే మార్కెటింగ్‌, కంప్యూటర్‌ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. దీంట్లో రాణించాలంటే.. గూగుల్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌, వెబ్‌ ఎనలిటిక్స్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, మార్కెటింగ్‌ ఆటోమేషన్‌, వెబ్‌ డిజైనింగ్‌ లాంటి కోర్సులను ఆఫ్‌లైన్‌/ ఆన్‌లైన్‌లో చేయాలి. మీకు డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఎనలిటిక్స్‌ రంగంపై ఆసక్తి ఉంటే గూగుల్‌ ఎనలిటిక్స్‌, గూగుల్‌ యాడ్‌ మేనేజర్‌, గూగుల్‌ యాడ్స్‌, హబ్‌ స్పాట్‌, మెయిల్‌ మోడొ, జీటీ మెట్రిక్స్‌, బిట్లీ, హూట్‌ సూట్‌, కేన్వా, గెట్‌ రెస్పాన్స్‌, బజ్‌ సుమో లాంటి టూల్స్‌ నేర్చుకోవాలి. పీజీ విషయానికొస్తే.. ఎంబీఏలో మార్కెటింగ్‌/ డిజిటల్‌ మార్కెటింగ్‌/ మార్కెటింగ్‌ ఎనలిటిక్స్‌ స్పెషలైజేషన్‌ చదివితే డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు