విజువల్ మీడియాలో
విజువల్ మీడియాలో పీజీ కోర్సులు ఏ యూనివర్సిటీల్లో ఉన్నాయి? వీటిని పూర్తిచేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
విజువల్ మీడియాలో పీజీ కోర్సులు ఏ యూనివర్సిటీల్లో ఉన్నాయి? వీటిని పూర్తిచేస్తే ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
జగన్నాథ్
విజువల్ మీడియాలో.. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ లాంటి సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సు చేయడానికి విద్యార్హతలతోపాటు సృజనాత్మకత, వర్చువల్ రియాలిటీపై ఆసక్తి, విజువల్ డిస్‌ప్లేలో అవగాహన, విజువల్ సమాచారాన్ని క్రోడీకరించడం/ విశ్లేషించడం, బాడీ లాంగ్వేజ్‌పై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, చిత్రలేఖనంపై ఆసక్తి, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. విజువల్ మీడియా కోర్సు చేసినవారికి సినిమా, టెలివిజన్ రంగాల్లో, యానిమేషన్ స్టూడియోల్లో, అడ్వర్టైజ్‌మెంట్ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి. ఈ కోర్సుని కొన్ని ప్రభుత్వ/ ప్రైవేటు విశ్వవిద్యాలయాలతోపాటు.. కళాశాలలూ అందిస్తున్నాయి. చేరాలనుకున్న సంస్థకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో నిర్దారించుకోండి. విజువల్ మీడియాలో పీజీ కోర్సుని దిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ, చెన్నైలోని అన్నా యూనివర్సిటీ, వేల్స్ యూనివర్సిటీ, మదురై కామరాజ్ యూనివర్సటీ, లయోలా కాలేజ్, డావిన్నీ మీడియా కాలేజ్, అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.. తదితర సంస్థలు అందిస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీల్లో ఎంఏ కమ్యూనికేషన్ కోర్సులో విజువల్ మీడియాని ఒక స్పెషలైజేషన్‌గా అందిస్తున్నారు. విజువల్ మీడియా లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్ని దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌గా చదవడమే మేలు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన
-
Movies News
Social Look: దెహ్రాదూన్‌లో అనన్య పాండే.. చీరలో అనసూయ హొయలు