జర్నలిజంలో పీజీ తర్వాత...
బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ) పూర్తిచేశాను. ఎంఏ జర్నలిజంలో పీజీ చేద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత ఉండే ఉన్నతోద్యోగావకాశాలేమిటి?
బీఏ (హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ) పూర్తిచేశాను. ఎంఏ జర్నలిజంలో పీజీ చేద్దాం అనుకుంటున్నాను. దీని తర్వాత ఉండే ఉన్నతోద్యోగావకాశాలేమిటి?
పి.సాంబశివారెడ్డి
జర్నలిజంలో పీజీ చేసినవారికి పత్రికా రంగంలో, టీవీ సంస్థల్లో మాత్రమే కాకుండా అడ్వర్టయిజింగ్, చలనచిత్ర, బోధన రంగాల్లోనూ, స్వచ్ఛంద సేవాసంస్థల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంఏ జర్నలిజం చదివితే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, కంటెంట్ రైటర్, ఈవెంట్ మేనేజర్, సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, కంటెంట్ ఎడిటర్, రేడియో/ వీడియో జాకీ, పొలిటికల్ క్యాంపైన్ ఎగ్జిక్యూటివ్, మీడియా ప్రొడ్యూసర్, ఎడిటర్, డైరెక్టర్ హోదాల్లో ఉద్యోగాలు చేయొచ్చు. జర్నలిజం కోర్సులో మీరు చదివిన స్పెషలైజేషన్ ఆధారంగా కూడా వివిధ రంగాలనూ, ఉద్యోగాలనూ ఎంచుకొనే వీలుంది. సాంకేతిక రంగంపై ఆసక్తి ఉంటే సౌండ్ ఇంజినీర్, టెక్నికల్ కమ్యూనికేషన్ ఎక్స్‌పర్ట్, వెబ్ డిజైనర్, సౌండ్ మిక్సర్, సౌండ్ రికార్దిస్ట్, యానిమేషన్ స్పెషలిస్ట్, గ్రాఫిక్ డిజైనర్‌గా స్థిరపడొచ్చు. జర్నలిజం రంగంలో రాణించాలంటే కమ్యూనికేషన్ సామర్థ్యాలు, నెట్ వర్కింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్, ఐటీ స్కిల్స్, క్రియేటివిటీ, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్‌పై మంచి పట్టు అవసరం.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు