ఆ పుస్తకాలు ఉపయోగమేనా?

గ్రూప్‌-2కి సన్నద్ధమవుతున్నాను. తెలుగు అకాడమీ పుస్తకాలు మార్కెట్లో దొరకడం లేదు.

Published : 23 Feb 2023 00:03 IST

గ్రూప్‌-2కి సన్నద్ధమవుతున్నాను. తెలుగు అకాడమీ పుస్తకాలు మార్కెట్లో దొరకడం లేదు. అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ పోటీ పరీక్షల కోసం విడుదల చేసిన పుస్తకాలు చదవటం మేలేనా?

టి.శ్రీకాంత్‌

పోటీ పరీక్షల్లో రాణించాలంటే చాలా రకాల పుస్తకాలను చదవాల్సి ఉంటుంది.ఒకటో, రెండో పుస్తకాలను చదివి పోటీలో నెగ్గడం చాలా కష్టం. ఇక గ్రూప్‌-2 విషయానికొస్తే తెలుగు అకాడెమీ పుస్తకాలు ప్రామాణికమైనా అవి మాత్రమే సరిపోవు. వీటితో పాటు  అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పుస్తకాలనూ, రకరకాల ఇతర పుస్తకాలనూ కూడా చదవాలి. అంబేడ్కర్‌ వర్సిటీ పుస్తకాలు తెలుగు అకాడెమీ పుస్తకాలకు ప్రత్యామ్నాయం కావు. గ్రూప్‌-2 పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది కాబట్టి, ప్రాథ]మిక అంశాలపై గట్టి పట్టు సాధించాలి. మీరు చదివే ప్రతి పుస్తకంలో ఉన్న సమాచార విశ్వసనీయతను ఒకటికి రెండుసార్లు నిర్థారించుకోండి. రకరకాల పుస్తకాలనుంచి సేకరించిన సమాచారాన్ని నోట్స్‌ రూపంలో రాసుకొని, అర్థం చేసుకొని చదవండి. సాధ్యమైనంతవరకు మొత్తం సిలబస్‌ని చదవండి. పోటీ పరీక్షల్లో ప్రతి అంశమూ ముఖ్యమే. ప్రణాళికాబద్ధంగా చదివి మీ కలను సాకారం చేసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని