దూరవిద్యలో సాంకేతిక కోర్సులు?

బీఏ (పాలిటిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జాగ్రఫీ) చదివి కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను.

Published : 01 Mar 2023 00:04 IST

బీఏ (పాలిటిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, జాగ్రఫీ) చదివి కేంద్రప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. దూరవిద్య ద్వారా టెక్నికల్‌ కోర్సులను ఏ యూనివర్సిటీలు అందిస్తున్నాయి?

బి. మూర్తి

సాంకేతిక (టెక్నికల్‌) కోర్సులంటే- కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌, మెకానికల్‌, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, బయో మెడికల్‌, కెమికల్‌, ఏరోనాటికల్‌, ఆప్టోమెట్రీ, మెడికల్‌ టెక్నాలజీ లాంటివి. ఒకవేళ మీ ఉద్దేశం ఇంజినీరింగ్‌ కోర్సులయితే మాత్రం మనదేశంలో ఏ యూనివర్సిటీ కూడా బీటెక్‌/ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సును దూరవిద్యలో అందించటం లేదు. ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఇంజినీరింగ్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌/ డిప్లొమా/ పీజీ డిప్లొమా కోర్సులు మాత్రం చాలా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో చేరాలంటే ఇంటర్‌/ డిగ్రీలో మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్త్రీ/ ఇంజినీరింగ్‌ చదివివుండాలి. మీరు కంప్యూటర్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ / డేటా సైన్స్‌ సంబంధిత సర్టిఫికెట్‌/ డిప్లొమా/పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకుంటే మాత్రం ప్రభుత్వ/ఓపెన్‌/ ప్రైవేటు యూనివర్సిటీలు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ డేటా సైన్స్‌లాంటి కోర్సుల్ని దూరవిద్య/ ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి.  

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు