లా చదివితే..?
కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల ఏ డిగ్రీ పూర్తి చేసినవారైనా, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదవొచ్చు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది.
ఎల్‌ఎల్‌బీ కోర్సు హైదరాబాద్‌లోని ఏయే యూనివర్సిటీల్లో ఉంది? దీని తర్వాత ఉండే ఉద్యోగావకాశాలేమిటి?
- ఎం. అజయ్‌కుమార్
కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల ఏ డిగ్రీ పూర్తి చేసినవారైనా, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదవొచ్చు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రైవేటు న్యాయ కళాశాలలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్ లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సును నల్సార్ యూనివర్సిటీ అందిస్తోంది. నల్సార్‌లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్ ప్రవేశపరీక్ష రాయవలసి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ ప్రైవేటు న్యాయ కళాశాలలు కూడా ఐదేళ్ల లా కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి టీఎస్ లాసెట్ రాయాలి. హైదరాబాద్‌లో ఉన్న కొన్ని డీమ్డ్/ ప్రైవేటు యూనివర్సిటీల్లో ఐదేళ్ల లా కోర్సులో చేరటానికి ఏదైనా జాతీయ/ రాష్ట్ర స్థాయి/ సంబంధిత ప్రైవేటు యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించివుండాలి.
ఒకప్పుడు ఎల్‌ఎల్‌బీ చదివినవారికి న్యాయవాద వృత్తిని మినహాయిస్తే పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండేవి కావు. కానీ ఇటీవలికాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చాలారకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌ఎల్‌బీ చదివినవారు లీగల్ అసోసియేట్, లా ఆఫీసర్, కార్పొరేట్ లాయర్, లీగల్ అడ్వైజర్, లీగల్ ఎనలిస్ట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే ఎల్‌ఎల్‌బీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేసి బోధన రంగంలోనూ స్థిరపడవచ్చు. ఇవన్నీ కాకుండా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకొనే అవకాశం ఎలాగూ ఉంటుంది.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం