బీఈడీ చేయాలంటే..

ఎంఏ తెలుగు పూర్తిచేశాను. బీఈడీ చేయాలనుకుంటున్నాను. కానీ ఎడ్‌సెట్‌ రాయలేదు. పేమెంట్‌ కట్టి సీటు సంపాదించొచ్చా?

Published : 13 Mar 2023 00:15 IST

ఎంఏ తెలుగు పూర్తిచేశాను. బీఈడీ చేయాలనుకుంటున్నాను. కానీ ఎడ్‌సెట్‌ రాయలేదు. పేమెంట్‌ కట్టి సీటు సంపాదించొచ్చా?

రాఘవ గణేష్‌కుమార్‌మూర్తి

* మేనేజ్‌మెంట్‌ కోటాలో పేమెంట్‌ ఫీజుతో బీఈడీ చేసే అవకాశం ఉంది కానీ, మేనేజ్‌మెంట్‌ కోటా సీటు కోసం కూడా ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణత అవసరం. చాలా సందర్భాల్లో ఎడ్‌సెట్‌ రాయనివారికి కూడా చాలా ప్రైవేటు కళాశాలలు యాజమాన్య కోటాలో ప్రవేశం కల్పిస్తున్నాయి. కౌన్సెలింగ్‌ ద్వారా సీటు పొందినవారికంటే మేనేజ్‌మెంట్‌ కోటాలో ఎక్కువ ఫీజు కట్టవలసి ఉంటుంది. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు అన్ని కోర్సులకూ, అన్నిరకాల అడ్మిషన్‌ల ప్రక్రియ ముగిసింది. మీరు 2023-24 విద్యా సంవత్సరంలో ఎడ్‌సెట్‌ రాసి కౌన్సెలింగ్‌ ద్వారా బీఈడీ చేసే ప్రయత్నం చేయండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని