Published : 15 Mar 2023 00:03 IST

దూరవిద్యలో ఎల్‌ఎల్‌బీ?

హైకోర్టులో ఉద్యోగం చేస్తున్నాను. ప్రమోషన్‌ కోసం ఎల్‌ఎల్‌బీ చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సును దూరవిద్యలో కూడా చదవొచ్చా?  

ఎన్‌.పూర్ణచంద్రరావు

ఎల్‌ఎల్‌బీ కోర్సును దూరవిద్యలో చదివే అవకాశం లేదు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్‌ పద్ధతిలోనే చదవాల్సివుంటుంది. ఏ నకిలీ విద్యాసంస్థ అయినా న్యాయవిద్యను దూరవిద్య విధానంలో అందిస్తామని చెబితే నమ్మి మోస పోకండి. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను వేటినీ దూరవిద్యలో అందించరు. ఒకవేళ ఎవరైనా అలాంటి కోర్సుల్లో చేరితే, ఆ కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు ఉండదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని