హోటల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌లో..

హోటల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశాను. ఈ కోర్సు చేసినవాళ్లకు ట్రావెల్‌ అండ్‌ టూరిజం రంగంలో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలియజేయగలరు.

Published : 27 Mar 2023 00:04 IST

ప్రశ్న: హోటల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేశాను. ఈ కోర్సు చేసినవాళ్లకు ట్రావెల్‌ అండ్‌ టూరిజం రంగంలో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలియజేయగలరు. ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌ ఏమైనా ఉంటాయా?

శ్రీకీర్తి

* హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ టూరిజంలో ఎంబీఏ చేసినవాళ్లు చాలామంది అందుబాటులో ఉన్నప్పటికీ.. నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. ఈ డిగ్రీ చేసినవాళ్లు ట్రావెల్‌ ఏజెంట్‌, టూర్‌ మేనేజర్‌, టూర్‌గైడ్‌, వీసా ఎగ్జిక్యూటివ్‌, ట్రావెల్‌ కన్సల్టెంట్‌, హోటల్‌ మేనేజర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, హాస్పిటాలిటీ మేనేజర్‌, సేల్స్‌ మేనేజర్‌, హౌస్‌కీపింగ్‌ మేనేజర్‌, గెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజర్‌, ఈవెంట్‌ మేనేజర్‌, బెవరెజ్‌ మేనేజర్‌, హాలిడే కన్సల్టెంట్‌, కేటరింగ్‌ మేనేజర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ఈ కోర్సు చదివినవారికి హోటల్‌, హాస్పిటల్‌, ట్రావెల్‌ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు, రిసార్ట్‌ల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ సంస్థలు అన్నింటిలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌/టూరిజం ఏంబీఏ కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అదే సంస్థలో ఉద్యోగం లభించే అవకాశమూ ఉంది. చాలా సంస్థలు ఇంటర్న్‌షిప్‌ చేసేవారికి స్టైపెండ్‌ కూడా ఇస్తున్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు