క్లినికల్‌ ఎస్‌ఏఎస్‌ చేస్తే...

ఎంఎస్సీ జువాలజీ చదివాను. ఐటీ మీద ఆసక్తితో క్లినికల్‌ ఎస్‌ఏఎస్‌ (స్టాటిస్టికల్‌ ఎనాలిసిస్‌ ఆఫ్‌ సిస్టమ్‌) చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సుతో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు.

Updated : 28 Mar 2023 05:36 IST

ఎంఎస్సీ జువాలజీ చదివాను. ఐటీ మీద ఆసక్తితో క్లినికల్‌ ఎస్‌ఏఎస్‌ (స్టాటిస్టికల్‌ ఎనాలిసిస్‌ ఆఫ్‌ సిస్టమ్‌) చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సుతో ఉండే ఉద్యోగావకాశాల గురించి తెలుపగలరు. 

కె.అరుంధతి

* ఇటీవల డేటా సైన్స్‌ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా చాలా పరిశ్రమలు/ పరిశోధనా సంస్థలు డేటా సైన్స్‌/ అనలిటిక్స్‌కి సంబంధించిన విషయాలపై దృష్టి సారించాయి. ఎంఎస్సీ జువాలజీ చదివిన తర్వాత క్లినికల్‌ ఎస్‌ఏఎస్‌ కోర్సు చేయడం వల్ల మీ ఉద్యోగావకాశాలు మెరుగువుతాయి. ఫార్మా కంపెనీలు, బయోటెక్‌ కంపెనీలు, పరిశోధనా సంస్థల్లో క్లినికల్‌ డేటా అనాలిసిస్‌ కోసం డేటా అనలిస్ట్‌ల అవసరం పెరుగుతోంది. మీరు ఈ కోర్సు చేశాక క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, క్లినికల్‌ డేటా అసోసియేట్‌, క్లినికల్‌ డేటా అనలిస్ట్‌, క్లినికల్‌ డేటా మేనేజర్‌గా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ కోర్సులో చేరేముందు బయో స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించండి. వీలుంటే ఎంఎస్‌ ఎక్సెల్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌లను కూడా నేర్చుకోండి.  

ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని