న్యాయవిద్య చదివితే ఏయే అవకాశాలు?

ఎల్‌ఎల్‌బీ తర్వాత లాయర్‌ కాకుండా.. ఇతర ఉద్యోగావకాశాలు ఏమైనా ఉంటాయా? 

Published : 01 May 2023 00:32 IST

ఎల్‌ఎల్‌బీ తర్వాత లాయర్‌ కాకుండా.. ఇతర ఉద్యోగావకాశాలు ఏమైనా ఉంటాయా?

శ్రీహరి

ల్‌ఎల్‌బీ తరువాత లాయర్‌ కాకుండా లీగల్‌ అడ్వైజర్‌, లీగల్‌ కన్సల్టెంట్‌, లీగల్‌ అనలిస్ట్‌, మీడియేటర్‌, ఆర్బిట్రేటర్‌, లా ఆఫీసర్‌, లైజన్‌ ఆఫీసర్‌, లీగల్‌ కౌన్సెలర్‌, కాంట్రాక్ట్‌ అడ్వైజర్‌, లేబర్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, లీగల్‌ జర్నలిస్ట్‌, కాంప్లియెన్స్‌ ఆఫీసర్‌, లీగల్‌ పబ్లిషర్‌, జ్యుడీషియల్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేస్తే ఆధ్యాపకులుగా, ట్రైనర్స్‌గా కూడా స్థిరపడవచ్చు. ఎల్‌ఎల్‌బీ తరువాత ఎంబీఏ/ జర్నలిజం/ సైకాలజీ/ సోషల్‌ వర్క్‌/ హ్యూమన్‌ రైట్స్‌/ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాంటి కోర్సులు చేస్తే మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు