నోటిఫికేషన్స్
గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఏబీవీ- ఐఐఐటీఎం) రెండేళ్ల ఫుల్ టైం ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ప్రవేశాలు
ట్రిపుల్ ఐటీఎం గ్వాలియర్‌లో ఎంబీఏ
గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయీ- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఏబీవీ- ఐఐఐటీఎం) రెండేళ్ల ఫుల్ టైం ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా)తోపాటు క్యాట్ స్కోరు.
ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఎక్స్‌టెంపోర్, రైటింగ్ కాంప్రహెన్షన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.500).
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-05-2023
వెబ్‌సైట్: https://iiitm.ac.in/
తెలంగాణ స్టేట్ డీఈఈసెట్-2023
తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(డీఈఈఈసెట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కోర్సులు:
1. డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)
2. డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్)
అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్ష ఉత్తీర్ణత.
వయసు: కనిష్ఠంగా సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయః పరిమితి లేదు.
సీట్ల కేటాయింపు: డీఈఈఈసెట్ ర్యాంకు ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 22.05.2023 వరకు.
హాల్ టిక్కెట్ల జారీ: 27.05.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 01.06.2023.
ఫలితాల ప్రకటన: 08.06.2023.
ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలు: 12/15.06.2023 నుంచి 05.07.2023 వరకు.
తరగతుల ప్రారంభం: 12.07.2023.
వెబ్‌సైట్: http://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx
డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో బీఈడీ ఎస్‌ఈ- ఓడీఎల్
హైదరాబాద్‌లోని డా.బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ఎస్‌ఈ- ఓడీఎల్ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
స్పెషలైజేషన్: విజువల్ ఇంపైర్‌మెంట్, హియరింగ్ ఇంపైర్‌మెంట్, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ.
అర్హత: 50% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం/ బీసీఏ/ బీఎస్సీ (హోమ్ సైన్స్)/ బీబీఎం/ బీబీఏ/ బీఈ/ బీటెక్) ఉత్తీర్ణత.
కోర్సు మాధ్యమం: ఇంగ్లిష్, తెలుగు.
వ్యవధి: రెండున్నరేళ్లు (5 సెమిస్టర్లు).
ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1000(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-05-2023. రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 28-05-2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 06-06-2023
వెబ్‌సైట్: https://myapplication.in/BRAOU/BRAOU_HOME.aspx
ఇండియన్ మారిటైం వర్సిటీలో యూజీ, పీజీ
ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ... 2023-24 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న ఆరు ఐఎంయూ క్యాంపస్‌లలో యూజీ, పీజీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఐఎంయూ క్యాంపస్‌లు: నవీ ముంబయి, ముంబయి పోర్ట్, కోల్‌కతా, విశాఖపట్నం, చెన్నై, కొచ్చి.
1. బీటెక్- మెరైన్ ఇంజినీరింగ్: 4 సంవత్సరాలు
2. బీటెక్- నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్: 4 సంవత్సరాలు
3. బీఎస్సీ- నాటికల్ సైన్స్: 3 సంవత్సరాలు
4. డీఎన్‌ఎస్(డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్): 1 సంవత్సరం
5. బీబీఏ- లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ-కామర్స్: 3 సంవత్సరాలు
6. అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ బీబీఏ- మారిటైమ్ లాజిస్టిక్స్: 3 సంవత్సరాలు
7. బీఎస్సీ- షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్: 3 సంవత్సరాలు
పీజీ ప్రోగ్రాం:
1. ఎంటెక్- నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్: 2 సంవత్సరాలు
2. ఎంటెక్- డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్: 2 సంవత్సరాలు
3. ఎంటెక్- మెరైన్ టెక్నాలజీ: 2 సంవత్సరాలు
4. ఎంబీఏ- ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్: 2 సంవత్సరాలు
5. ఎంబీఏ- పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్: 2 సంవత్సరాలు
పోస్ట్- గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజినీరింగ్: ఏడాది
రిసెర్చ్ ప్రోగ్రాం: పీహెచ్‌డీ, ఎంఎస్ (బై రిసెర్చ్).
అర్హత: కోర్సును అనుసరించి 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
సీట్ల కేటాయింపు: కోర్సును అనుసరించి ప్రవేశ పరీక్ష, గేట్, పీజీసెట్, మ్యాట్, సీమ్యాట్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 18.05.2023.
హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 26.05.2023.
ఐఎంయూ-సెట్ తేదీ: 10.06.2023
ఫలితాల వెల్లడి: 19.06.2023.
వెబ్‌సైట్: https://imu.edu.in/
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?
-
Congress: అజయ్ మాకెన్‌కు కీలక పదవి!
-
Supriya Sule: ఆ రెండు పార్టీల చీలిక వెనక.. భాజపా హస్తం: సుప్రియా
-
KTR: ఓఆర్ఆర్ చుట్టూ సైకిల్ ట్రాక్.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్