జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ ఇష్టమంటోంది..

మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ చదువుతానంటోంది. ఈ కోర్సు చదవాలంటే ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకోవాలి?

Updated : 03 May 2023 01:08 IST

మా అమ్మాయి పదో తరగతి చదువుతోంది. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ చదువుతానంటోంది. ఈ కోర్సు చదవాలంటే ఇంటర్‌లో ఏ గ్రూప్‌ తీసుకోవాలి?

బి.ఎన్‌.బి.మోహన్‌

దో తరగతి చదివే పిల్లలకు జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ లాంటి టెక్నికల్‌ సబ్జెక్టుల మీద పూర్తి అవగాహన ఉండదు. వారు ఇటీవల చూసిన సినిమా ప్రభావంతోనో, చదివిన కథ ప్రభావంతోనో, అప్పుడే జరిగిన జెనెటిక్స్‌ తరగతి ప్రభావంతోనో అలా ఆలోచించే అవకాశం ఉంది. అమ్మాయి అదే ఆశయంపై కొన్ని సంవత్సరాల పాటు, అంతే ఇష్టంతో ఉంటే కచ్చితంగా ఆ కోర్సే చదివించండి. కానీ మనదేశంలో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదివినవారికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా లేవు. ఈ కోర్సు చదివినవారికి విదేశాల్లో మంచి భవిష్యత్తు ఉంది.

జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలంటే ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ మ్యాథ్స్‌, బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు చదవాలి. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు ఇంటర్‌ ఎంపీసీ చదివినవారికి కూడా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు అందుబాటులో లేదు. తమిళనాడు, దిల్లీ లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కోర్సు పరిమిత కళాశాలల్లో/ యూనివర్సిటీల్లో మాత్రమే ఉంది. జెనెటిక్‌ ఇంజినీరింగ్‌లో ప్రవేశానికి ఆయా రాష్ట్రాలు/ యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఈ కోర్సుకు పెద్దగా డిమాండ్‌ లేనందున ఇంటర్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా కూడా ప్రవేశం పొందే అవకాశం ఉంది. చివరిగా మీఅమ్మాయి జెనెటిక్స్‌ కోర్సు మాత్రమే చదవాలని పట్టుపడితే ఇంటర్‌లో బైపీసీ, బీఎస్సీలో జెనెటిక్స్‌, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులతో చదివించి, డిగ్రీ తరువాత తనకు నచ్చిన కోర్సు ఎంచుకోమని చెప్పండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని