అక్కడ మాస్టర్స్‌.. ఇక్కడ పీహెచ్‌డీ?

నేను యూఎస్‌లో మాస్టర్స్‌ చేశాను. ఇప్పుడు ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయవచ్చా?

Published : 08 May 2023 00:21 IST

నేను యూఎస్‌లో మాస్టర్స్‌ చేశాను. ఇప్పుడు ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయవచ్చా?

ఎంవీఆర్‌ సుబ్బారావు

మీరు యూఎస్‌లో ఏ సబ్జెక్టులో మాస్టర్స్‌ చేశారో చెప్పలేదు. అలాగే మాస్టర్స్‌ కాలవ్యవధి ఒక సంవత్సరమో, రెండు సంవత్సరాలో కూడా చెప్పలేదు. సాధారణంగా యూఎస్‌లో రెండు సంవత్సరాల మాస్టర్స్‌లో 36 నుంచి 42 క్రెడిట్‌లుంటాయి. మనదేశంలో రెండు సంవత్సరాల పీజీ కోర్సులో 72 నుంచి 80 క్రెడిట్‌లు ఉంటాయి. మనదేశంలో ఎంటెక్‌ కోర్సులో అయితే 68 క్రెడిట్‌లుంటాయి. మీరు ఆంధ్రా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయాలంటే ముందుగా యూఎస్‌లో చేసిన మాస్టర్స్‌ డిగ్రీ, ఇండియా మాస్టర్స్‌ డిగ్రీకి సమానమని ఆంధ్ర యూనివర్సిటీ వారు అంగీకరించాలి.

డిల్లీలో ఉన్న అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ (ఏఐయూ) వారు కోర్సు కాల వ్యవధి, క్రెడిట్ల సంఖ్య, సిలబస్‌ లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని యూఎస్‌ డిగ్రీ, ఇండియన్‌ డిగ్రీకి సమానమని ఈక్వివలెన్స్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు. ఏఐయూ వెబ్‌సైట్‌కి వెళ్ళి, మీరు చదివిన యూఎస్‌ యూనివర్సిటీ మాస్టర్స్‌ డిగ్రీకి ఇండియన్‌ మాస్టర్స్‌ డిగ్రీతో సమాన హోదా ఇచ్చారేమో చూడండి. లేని పక్షంలో ఏఐయూకి మీరే దరఖాస్తు చేసుకోండి. ఇదంతా చేసేముందు ఒకసారి ఆంధ్రా యూనివర్సిటీలో రీసెర్చ్‌ డీన్‌ని సంప్రదించి, మీ పీహెచ్‌డీ అవకాశాల గురించి చర్చించండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు