హిందీ పండిట్‌ కోర్సు ఎలా?

డిగ్రీ చేశాను. హిందీ పండిట్‌ కోర్సు చదవాలనుంది. దక్షిణ భారత్‌ హిందీ ప్రచారసభ పరీక్షలు పాసయ్యా. లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ ప్రైవేటుగా చదవడానికీ, డీఎస్సీకీ వీలుంటుందా?

Published : 10 May 2023 00:04 IST

డిగ్రీ చేశాను. హిందీ పండిట్‌ కోర్సు చదవాలనుంది. దక్షిణ భారత్‌ హిందీ ప్రచారసభ పరీక్షలు పాసయ్యా. లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ ప్రైవేటుగా చదవడానికీ, డీఎస్సీకీ వీలుంటుందా?

ఎం.శ్రీలత

* మీరు డిగ్రీలో హిందీని ఒక ఆప్షనల్‌ సబ్జెక్టుగా చదివారో, ఒక లాంగ్వేజ్‌గా అయినా చదివారో లేదో తెలియదు. గతంలో హిందీ పండిట్‌ కోర్సు చేయాలంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రవీణ/ విద్వాన్‌ చేసినవారికి కూడా అర్హత ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా 2018లో జారీ అయిన జీఓ ప్రకారం- లాంగ్వేజ్‌ పండిట్‌ శిక్షణ పొందాలంటే డిగ్రీలో హిందీని ఒక ఆప్షనల్‌గా చదివుండాలి. బి.ఎ. (హిందీ లిటరేచర్‌) చేసినవారికీ, హిందీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఓరియంట్‌ లాంగ్వేజెస్‌ చేసినవారికీ, ఎంఏ హిందీ చేసినవారికీ కూడా ఎల్‌పీసెట్‌ (లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయడానికి అర్హత ఉంది. ఎల్‌పీసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చేసే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాల నుంచి హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేస్తే, డీఎస్సీ రాయడానికి అర్హులవుతారు. హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సును ప్రైవేటుగా/ దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు