ఫార్మా కోర్సు ఏది మేలు?
ఎం.ఫార్మసీ చదివి.. ఏడాది ఆర్ అండ్ డీలో, రెండేళ్లు ప్రొడక్షన్ విభాగంలో, ఐదున్నరేళ్లు ఫార్మకో విజిలెన్స్‌లో ఉద్యోగం చేశాను
ఎం.ఫార్మసీ చదివి.. ఏడాది ఆర్ అండ్ డీలో, రెండేళ్లు ప్రొడక్షన్ విభాగంలో, ఐదున్నరేళ్లు ఫార్మకో విజిలెన్స్‌లో ఉద్యోగం చేశాను. తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల సన్నద్ధత కోసం రాజీనామా చేశా. ఆర్నెల్ల నుంచీ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. అదనంగా ఫార్మా కోర్సు ఏది చేస్తే మేలు?
ఇ. మాధురి
ఫార్మా కంపెనీల్లో దాదాపు 9 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి, ఆ అనుభవంతోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఈ క్రమంలో మీరు అంతకుముందు పొందిన వేతనం కంటే తక్కువకైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ కొంత ఇబ్బందికరంగా ఉన్నందున నచ్చిన ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా అందుబాటులో ఉన్న ఉద్యోగంలో చేరండి. ఆపై మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయండి. ఆర్ అండ్ డీలోనూ పనిచేశారు కాబట్టి ఫార్మసీలో పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేసి పరిశోధన/ బోధన రంగంలో స్థిరపడొచ్చు. ఫార్మకో విజిలెన్స్‌లో చాలాకాలం పనిచేశారు కాబట్టి దీనిలోనే పీజీ డిప్లొమా చేయొచ్చు. ఆసక్తి ఉంటే మెడికల్ రైటింగ్, క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ డేటా మేనేజ్‌మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఫార్మకాలజీల్లో పీజీ డిప్లొమా చేసే అవకాశమూ ఉంటుంది.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kriti Sanon: సినిమా ప్రచారం కోసం.. రూ. 6 లక్షల ఖరీదైన డ్రెస్సు!
-
Pawan Kalyan: కృష్ణా జిల్లాలో 5రోజుల పాటు పవన్ వారాహి యాత్ర
-
Social Look: లండన్లో అల్లు అర్జున్.. చెమటోడ్చిన ఐశ్వర్య.. సెట్లో రష్మి
-
Britney Spears: కత్తులతో డ్యాన్స్.. పాప్ సింగర్ ఇంటికి పోలీసులు
-
Uttar Pradesh: అమానవీయ ఘటన.. బాలిక మృతదేహాన్ని ఆసుపత్రి బయట బైక్పై పడేసి వెళ్లిపోయారు!
-
Dhruva Natchathiram: ఆరేళ్ల క్రితం సినిమా.. ఇప్పుడు సెన్సార్ పూర్తి..!