బీఫార్మసీ తర్వాత ఏయే అవకాశాలు?

ఫార్మసీ చేసినవారికి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫార్మసిస్ట్‌, మెడికల్‌  రిప్రజెంటేటివ్‌ ఉద్యోగాలు ఉంటాయని తెలుసు. ఇవికాకుండా ఇంకా ఏయే అవకాశాలు ఉంటాయి? 

Updated : 17 May 2023 04:09 IST

ఫార్మసీ చేసినవారికి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఫార్మసిస్ట్‌, మెడికల్‌  రిప్రజెంటేటివ్‌ ఉద్యోగాలు ఉంటాయని తెలుసు. ఇవికాకుండా ఇంకా ఏయే అవకాశాలు ఉంటాయి? 

ఎం.విజయ

న్ని రంగాల్లోలానే ఇక్కడా ఎన్నో కొత్తకొత్త ఉద్యోగాలు వచ్చేశాయి. అనలిటికల్‌ కెమిస్ట్‌, కెమికల్‌ టెక్నీషియన్‌, క్లినికల్‌ రిసెర్చర్‌, హాస్పిటల్‌ డ్రగ్‌ కో ఆర్డినేటర్‌, డ్రగ్‌ థెరపిస్ట్‌, డ్రగ్‌ టెక్నీషియన్‌, పాథలాజికల్‌ ల్యాబ్‌ సైంటిస్ట్‌, మెడికల్‌ రైటర్‌, డ్రగ్‌ సేఫ్టీ అసోసియేట్‌, రెగ్యులేటరీ అఫైర్స్‌ ఆఫీసర్‌, ఫార్ములేషన్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌, క్వాలిటీ కంట్రోల్‌/ క్వాలిటీ అస్యూరెన్స్‌ అసోసియేట్‌, కమ్యూనిటీ ఫార్మసిస్ట్‌ లాంటి కొలువులు కూడా అందుబాటులో ఉన్నాయి. పైన పేర్కొన్న ఉద్యోగాలు విదేశీ ఫార్మా కంపెనీల్లో చాలాకాలం నుంచి ఉన్నాయి. మనదేశంలోని ఫార్మా కంపెనీలు ఇప్పుడిప్పుడే వివిధ స్పెషలైజ్డ్‌ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని