ఏ పేపర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి?
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2015, 2018ల్లో ఎస్‌జీటీ పేపర్ రాశాను. బీఈడీని ఇంగ్లిష్, సోషల్ స్టడీస్ కాంబినేషన్‌లో పూర్తిచేశాను.
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ 2015, 2018ల్లో ఎస్‌జీటీ పేపర్ రాశాను. బీఈడీని ఇంగ్లిష్, సోషల్ స్టడీస్ కాంబినేషన్‌లో పూర్తిచేశాను. రాబోయే డీఎస్సీలో ఎస్‌జీటీ పేపర్‌తోపాటు ఎస్‌ఏ ఇంగ్లిష్, ఎస్‌ఏ సోషల్ స్టడీస్ రాద్దామనుకుంటున్నాను. సిలబస్ ఎక్కువగా ఉన్నందున ఏ పేపర్‌కు ప్రాధాన్యం ఇస్తే మంచిది?
కె. మెస్సీ
* మీ విద్యార్హతలు, గత ఉద్యోగానుభవం పూర్తి వివరాలు తెలియచేసి ఉంటే మీ సమస్యను విపులంగా చర్చించే అవకాశం ఉండేది. డీఎస్సీ రాసేముందు మీకు ఏ సబ్జెక్ట్‌పై పట్టు, ఆసక్తి ఉందో తెలుసుకోండి. డీఎస్సీలో ఇంగ్లిషు, సోషల్ స్టడీస్‌ల్లో ఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ ఖాళీలున్నాయో, మీకేదైనా సామాజిక రిజర్వేషన్ ఉంటే ఆ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలున్నాయో అనేదాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకొని, ఆ సబ్జెక్ట్‌లో డీఎస్సీకి సన్నద్ధం కండి. డీఎస్సీలో అన్ని సబ్జెక్ట్‌లకు సిలబస్ దాదాపు సమానంగానే ఉంటుంది. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా చదవండి. పోటీ పరీక్షల సన్నద్ధతకు, యూనివర్సిటీ పరీక్షల సన్నద్ధతకు చాలా తేడా ఉంటుంది. మార్కెట్‌లో దొరికే పోటీ పరీక్షల పుస్తకాలతో పాటు బీఈడీ కోర్సు పుస్తకాలను క్షుణ్ణంగా చదివి, సొంత నోట్సు తయారుచేసుకోండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: మణిపుర్ సీఎం ఇంటిపై దాడి చేసేందుకు అల్లరిమూక ప్రయత్నం
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా... (29/09/2023)
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Netherlands: నెదర్లాండ్స్‌లో కాల్పుల కలకలం.. తొలుత ఓ ఇంటిపై.. ఆతర్వాత ఆసుపత్రిలో
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్