ఆరేళ్ల విరామం... అవకాశాలు ఎలా?
ఎంటెక్ స్ట్రక్చర్స్ (2014) చేశాను. ఇంజినీరింగ్ కాలేజీలో రెండేళ్ల టీచింగ్ అనుభవం ఉంది. అనారోగ్యంతో 2017 నుంచీ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది.
ఎంటెక్ స్ట్రక్చర్స్ (2014) చేశాను. ఇంజినీరింగ్ కాలేజీలో రెండేళ్ల టీచింగ్ అనుభవం ఉంది. అనారోగ్యంతో 2017 నుంచీ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఉద్యోగావకాశాలు ఇప్పుడెలా ఉంటాయి?
ఆర్.కృష్ణచైతన్య
* మీరు గత ఆరు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఉద్యోగం వెదకడం కొంత కష్టంతో కూడుకొన్న పనే. మీరు ఉద్యోగం మానేశాక, రెండు తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ సైన్స్ అనుబంధ నూతన బ్రాంచిలైన డేటా సైన్స్, అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటివి ప్రవేశపెట్టడంవల్ల సంప్రదాయ బ్రాంచిలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో అడ్మిషన్లు తగ్గాయి. చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్ ఇంజినీరింగ్‌లో చేరే వారిసంఖ్య రెండు అంకెలు కూడా దాటడం లేదు. ఇలాంటి సందర్భంలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బోధన ఉద్యోగాన్వేషణ ఏటికి ఎదురీదినట్లే! ఇప్పుడు మీముందు ఏడు అవకాశాలున్నాయి. 1. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో సివిల్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం. 2. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో డిగ్రీ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకోసం ప్రయత్నించడం. 3. మీ వయసు బ్యాంకులు నిర్దేశించిన గరిష్ఠ పరిమితి కంటే తక్కువగా ఉంటే ప్రభుత్వ/ ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం. 4. ఏదైనా కన్‌స్ట్రక్షన్ కంపెనీలో స్ట్రక్చరల్ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేసి, మీకు ఆర్థిక స్థోమత ఉంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించడం. 5. ఆసక్తి ఉంటే స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేయడం. 6. డేటాసైన్స్‌లో ఎంటెక్ చేసి, ఆ రంగంలో బోధన/ బోధనేతర ఉద్యోగాల కోసం ప్రయత్నించడం. 7. ఎవరైనా కాంట్రాక్టర్ దగ్గర స్ట్రక్చరల్/ సైట్ ఇంజినీర్‌గా అనుభవం గడించి, ఆర్థిక స్థోమత ఉంటే సొంతంగా కాంట్రాక్టులు చేస్తూ కాంట్రాక్టర్‌గా స్థిరపడటం!
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
బ్రిజ్‌భూషణ్‌కు యూపీ షాకిచ్చిందా..?వాయిదా పడిన ఎంపీ ర్యాలీ
-
Sports News
IPL 2023: ధోనీ మేనియాగా ఈ ఐపీఎల్ సీజన్ : రమీజ్ రజా
-
World News
Russia: రష్యాలో ఐఫోన్లపై అమెరికా ‘హ్యాకింగ్’..!
-
General News
CM Jagan: రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
YS bhaskar reddy: భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా