జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు?

బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లోని ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్స్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీగా పనిచేశాను.

Published : 29 May 2023 00:02 IST

బీటెక్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లోని ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్స్‌లో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రెయినీగా పనిచేశాను. ఇదే విభాగంలో ఉద్యోగ సాధనకు ఏ కోర్సు చేయాలి? మా బ్రాంచివారికి జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు ఏమున్నాయి?

రాజు, మచిలీపట్నం  

* స్టీల్‌ ప్లాంట్‌లో ఎయిర్‌ కండిషనింగ్‌ విభాగంలో ఉద్యోగానికి మీ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ ట్రైనీ అనుభవం ఉపయోగపడుతుంది. అదనపు విద్యార్హతల కోసం హీటింగ్‌, వెంటిలేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌లో డిప్లొమా కోర్సు కానీ, మాస్టర్‌ సర్టిఫికేషన్‌ కోర్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ కోర్సు కానీ, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ అండ్‌ రెఫ్రిజరేషన్‌ సర్వీసెస్‌ గానీ చేయొచ్చు. జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల విషయానికొస్తే- ఆటో క్యాడ్‌, క్యాస్టింగ్‌ అండ్‌ ఫోర్జింగ్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, యూనిగ్రాఫిక్స్‌, సాలిడ్‌ వర్క్స్‌, 3డీ… ప్రింటింగ్‌ అండ్‌ డిజైన్‌, మెకట్రానిక్స్‌, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సుల్లో మీకు ఆసక్తి ఉన్నవాటిని ఎంచుకోండి. మీకు సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే అందుకు సంబంధించిన కోర్సుల  గురించి కూడా ఆలోచించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని