సైకాలజీ చదివితే..?
ఇంటర్ పాసయ్యాను. సైకాలజీ మెయిన్‌గా బీఏ చదవాలనుంది. ఈ కోర్సుతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
ఇంటర్ పాసయ్యాను. సైకాలజీ మెయిన్‌గా బీఏ చదవాలనుంది. ఈ కోర్సుతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?
టి.శ్రీకాంత్
డిగ్రీలో సైకాలజీ సబ్జెక్టుతో పాటు ఇంగ్లిష్ లిటరేచర్, ఎకనామిక్స్, జర్నలిజం లాంటివి కూడా చదివే అవకాశం ఉంది. జాతీయ విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలోకి అమల్లోకి వస్తే సైకాలజీతో పాటు మీకు నచ్చిన సబ్జెక్టులు ఏవైనా/ ఎన్నయినా ఎంచుకునే వీలుంటుంది. సైకాలజీలో నాలుగు సంవత్సరాల ఆనర్స్ కోర్సు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కూడా చేయొచ్చు. ఉన్నత విద్యతో మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కుతాయి. సాధారణంగా ఈ కోర్సు చదివిన వారు కౌన్సెలర్, ట్రైనర్‌లుగా స్థిరపడతారు. మీకు బోధనపై ఆసక్తి ఉంటే సైకాలజీలో పీహెచ్‌డీ చేసి అధ్యాపకులుగా రాణించవచ్చు. సైకాలజీ చదివినవారికి మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉపాధి అవకాశాలుంటాయి. ఈ సబ్జెక్టులో చాలా స్పెషలైజేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో.. కౌన్సెలింగ్ సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇండస్ట్రియల్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీలు ముఖ్యమైనవి. డిగ్రీ పూర్తి చేశాక మీ అభిరుచికి అనుగుణంగా స్పెషలైజేషన్‌ని ఎంచుకొని ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. సైకాలజీ చదివినవారు జర్నలిజం, సోషల్ వర్క్, కెరియర్ కౌన్సిలింగ్ రంగాల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. సైకాలజిస్టులకు విదేశాల్లో డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే అక్కడే ఉన్నతవిద్యను చదివే ప్రయత్నం కూడా చేయవచ్చు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Koppula Harishwar Reddy: ప్రభుత్వ అధికార లాంఛనాలతో హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియలు
-
Chandrababu Arrest : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు విచారణ ప్రారంభం
-
Kakinada: పామాయిల్ తోటలో విద్యుత్ తీగలు తగిలి.. ముగ్గురి మృతి
-
Justin Trudeau: ‘మేం ముందే ఈ విషయాన్ని భారత్‌కు చెప్పాం’: ఆగని ట్రూడో వ్యాఖ్యలు
-
Jailer: రజనీకాంత్ ‘జైలర్’ కథను మరోలా చూపించవచ్చు: పరుచూరి విశ్లేషణ
-
Vikarabad: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది విద్యార్థులు సురక్షితం