నోటిస్ బోర్డు

దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీడీసీ).. 176 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 13 Jun 2024 00:34 IST

ఉద్యోగాలు

దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీలు 
పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ (డీడీసీ).. 176 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ అండ్‌ ఐ, ఐటీ, కెమికల్‌.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ డిగ్రీతో పాటు గేట్‌-2023 స్కోరు.
వేతన శ్రేణి: నెలకు రూ.56,100 - రూ.1,77,500.
వయసు: 29 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్‌-2023 స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07/07/2024.

జూనియర్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-2 పోస్టులు

దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌.. 64 జూనియర్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌-2 (జేఈ గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సీ అండ్‌ ఐ, కమ్యూనికేషన్, మైన్‌ సర్వేయర్‌.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా.
వేతన శ్రేణి: నెలకు రూ.35,400 - రూ.1,12,400.
వయసు: మైన్‌ సర్వేయర్‌ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04/07/2024.
వెబ్‌సైట్‌: https://www.dvc.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని