ప్రవేశపరీక్షలకు వీలుంటుందా?

నా వయసు 25 సంవత్సరాలు. ఆర్థిక సమస్యలతో చదువు మధ్యలో ఆపేశాను.  ఈ వయసులో ఎంసెట్, నీట్‌ రాయడానికి అవకాశం ఉంటుందా?  

Published : 13 Jun 2024 00:36 IST

నా వయసు 25 సంవత్సరాలు. ఆర్థిక సమస్యలతో చదువు మధ్యలో ఆపేశాను.  ఈ వయసులో ఎంసెట్, నీట్‌ రాయడానికి అవకాశం ఉంటుందా?   

సాయి

ఎంసెట్, నీట్‌ పరీక్షలు రాయడానికి వయః పరిమితి ఏమీ లేదు. మీకు ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా ప్రవేశ పరీక్షలు రాయవచ్చు. కానీ మీకంటే కనీసం ఎనిమిది సంవత్సరాల వయసు తక్కువగా ఉన్న అభ్యర్థులతో పోటీ పడాలి. పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపర్చినా మీకంటే చిన్న వయసువారితో కొన్ని సంవత్సరాలపాటు కలిసి చదవాలి. అందుకు మానసికంగా సిద్ధపడి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజినీరింగ్, మెడిసిన్‌ లాంటి కోర్సులు చదివినంత మాత్రాన మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్న భరోసా లేదు. డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా ఉంటేనే మేటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని