పీజీని వేరే కాంబినేషన్లతో చదవొచ్చా?

మీరు డిగ్రీలో బయోకెమిస్ట్రీ చదివారు కాబట్టి పీజీ కూడా ఇదే సబ్జెక్టులో చేయటం వల్ల మేలుంటుంది.

Published : 20 Jun 2024 01:53 IST

బీఎస్సీ బయోకెమిస్ట్రీ చేశాను. తర్వాత ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ కాకుండా ఇతర కాంబినేషన్లతో చదవటం మేలేనా? ఈ కోర్సుతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

మంజు

మీరు డిగ్రీలో బయోకెమిస్ట్రీ చదివారు కాబట్టి పీజీ కూడా ఇదే సబ్జెక్టులో చేయటం వల్ల మేలుంటుంది. ఐదేళ్లపాటు బయోకెమిస్ట్రీ చదవడం వల్ల అవగాహన, విషయ పరిజ్ఞానం పెరిగి బయోకెమిస్ట్రీ రంగంలో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఎక్కువ. పీజీలో బయోకెమిస్ట్రీ చదివినవారు బయో కెమిస్ట్, అనలిటికల్‌ కెమిస్ట్, బయోమెడికల్‌ సైంటిస్ట్, ఫోరెన్సిక్‌ సైంటిస్ట్, ఫార్మకాలజిస్ట్,  టాక్సికాలజిస్ట్, ఫుడ్‌ సైంటిస్ట్, సైంటిఫిక్‌ ల్యాబొరెటరీ టెక్నీషియన్, బయో టెక్నాలజిస్ట్, సైంటిఫిక్‌ రైటర్‌.. ఇలా వివిధ హోదాల్లో  ఉద్యోగావకాశాలకు ఆస్కారం ఉంటుంది. 


లైఫ్‌ సైన్సెస్‌కు సంబంధించిన సబ్జెక్టుల్లో పీజీ చేస్తే అధ్యాపక ఉద్యోగాలు, పరిశ్రమ సంబంధిత అవకాశాలు అందుబాటులో ఉంటాయి.  


ఒకవేళ మీరు పీజీలో బయోకెమిస్ట్రీ కాకుండా వేరే సబ్జెక్టులు చదవాలనుకుంటే బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యుటేషనల్‌ బయాలజీ, సిస్టమ్స్‌ బయాలజీ, బయో మెడికల్‌ సైన్స్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, బిహేవియరల్‌ బయాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీ, సెల్‌ అండ్‌ సిస్టమ్స్‌ బయాలజీ, బయో ఆంత్రప్రెన్యూర్‌షిప్, పబ్లిక్‌ హెల్త్, ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) లాంటి సబ్జెక్టులతో పీజీ చేయొచ్చు. లైఫ్‌ సైన్సెస్‌కు సంబంధించిన సబ్జెక్టుల్లో పీజీ చేస్తే అధ్యాపక ఉద్యోగాలు, పరిశ్రమ సంబంధిత అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) చదివితే హాస్పిటల్, హెల్త్‌కేర్‌ రంగల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పీజీ తరువాత పీహెచ్‌డీ, విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా బోధన, పరిశోధన రంగాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగం పొందడం కోసమే కాకుండా మీకు ఆసక్తి ఉన్న కోర్సు చదివితేనే ఆ రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని