నోటీస్‌బోర్డు

పంజాబ్‌ రాష్ట్రంలోని ఐఐటీ రోపర్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ ఇంజినీరింగ్‌ స్కూల్‌.. కింది టీచింగ్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Published : 10 Jul 2024 00:13 IST

ఉద్యోగాలు

రోపర్‌ ఐఐటీలో ఫ్యాకల్టీ 

పంజాబ్‌ రాష్ట్రంలోని ఐఐటీ రోపర్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డేటా సైన్స్‌ ఇంజినీరింగ్‌ స్కూల్‌.. కింది టీచింగ్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1 పోస్టుకు రూ.1,01,500. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2 పోస్టుకు రూ.70,900.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024.

వెబ్‌సైట్‌: https://www.iitrpr.ac.in/


రిహాబిలిటేషన్‌

కేంద్రంలో ఖాళీలు 

కటక్‌లోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 3 గ్రూప్‌-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌-2: 01
  • కుక్‌: 02 

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐతో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుకు రూ.19,000-రూ.63,200. కుక్‌ పోస్టుకు రూ.18,000-56,900.
వయసు: ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌-2 పోస్టుకు 30 ఏళ్లు, కుక్‌ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ ఎస్టీలకు రూ.250. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు: నోటిఫికేషన్‌ వెలువడిన తేదీ నుంచి (2-07-2024) 30 రోజుల్లోపు ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్, ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్, ఓలత్‌పుర్, కటక్, ఒడిశా’ చిరునామాకు పంపించాలి.

వెబ్‌సైట్‌: https://svnirtar.nic.in/


వాక్‌-ఇన్‌

ఎన్‌సీఈఎస్‌ఎస్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు 

కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్స్‌ స్టడీస్‌.. ఒప్పంద ప్రాతిపదికన 5 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌): 02  
  • ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1 (సివిల్‌) : 01  
  • కన్సల్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)/సివిల్‌): 02 

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్‌తో పాటు పని అనుభవం.
వేతనం: నెలకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.20,000, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌కు రూ.31,000, కన్సల్టెంట్‌ ఇంజినీర్‌కు రూ.50,000.
వయసు: ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 50 ఏళ్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు కన్సల్టెంట్‌ ఇంజినీర్‌కు 63 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 18-07-2024.
వేదిక: ఎన్‌సీఈఎస్‌ఎస్, అక్కులమ్, తిరువనంతపురం.

వెబ్‌సైట్‌: https://www.ncess.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని