జిందాల్ వర్సిటీలోయూజీ.. పీజీ కోర్సులు
జేశాట్ ప్రకటన విడుదల
నాణ్యమైన విద్యకు పేరు పొందిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కొన్ని మన దేశంలో ఉన్నాయి. సాధారణ కోర్సులతోపాటు వైవిధ్య కాంబినేషన్లతో యూజీలు, పీజీలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటైన జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు ఆసక్తి మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశంలో పేరున్న ప్రైవేటు విద్యా సంస్థల్లో హరియాణలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఒకటి. ఈ సంస్థ పలు యూజీ, పీజీ కోర్సుల్లోకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది.
కోర్సుల వివరాలు
బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ (ఆనర్స్), ఇంటిగ్రేటెడ్ బీబీఏ+ఎంబీఏ, బీకాం ఆనర్స్, బీఆర్క్, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్.
బీఏ ఆనర్స్: గ్లోబల్ అఫైర్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్ అండ్ పాలసీ, లిబరల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, జర్నలిజం అండ్ మీడియా స్టడీస్, బిల్ట్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్
ఎంఏ: డిప్లొమసీ, లా అండ్ బిజినెస్; పబ్లిక్ పాలసీ, ఎకనామిక్స్, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ
అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీకి సంబంధిత సబ్జెక్టుల్లో యూజీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంబీఏకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదో ఒక మేనేజ్‌మెంట్ పరీక్ష స్కోరు తప్పనిసరి. లా కోర్సులకు ఎల్‌శాట్ స్కోర్ ఉండాలి. యూజీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ అర్హులే.
ఎంపిక విధానం: యూజీ కోర్సులకు ఎస్‌ఏటీ లేదా ఏసీటీతో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా జిందాల్ శాట్ రాయాలి..గ్రేడ్ మార్కులు, ఫ్యాకల్టీ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు. పీజీ కోర్సులకు పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి. ఎంబీఏకు ఇంటర్వ్యూ ఉంటుంది.
జేశాట్: ఇందులో 120 ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్ వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ స్కిల్స్ ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.
అన్ని కోర్సులకూ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. https://admissions.jgu.edu.in
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Smyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
-
India News
Kerala: సమాధిపై క్యూఆర్ కోడ్!.. వైద్యుడైన కుమారుడి స్మృతులకు కన్నవారి నివాళి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Mission venus: 2028లో శుక్రగ్రహ మిషన్!: ఇస్రో అధిపతి సోమనాథ్
-
Ap-top-news News
AP High Court: క్రిమినల్ కేసు ఉంటే కోర్టు అనుమతితోనే పాస్‌పోర్టు పునరుద్ధరణ: హైకోర్టు
-
Sports News
Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్