వ్యాక్సిన్‌ జాబ్‌.. వ్యంగ్యోక్తుల జైబ్‌

ఇంగ్లిష్‌ దినపత్రికల శీర్షికల్లో, వార్తల్లో ఇటీవల తరచూ కనిపిస్తున్న ఓ రెండు వ్యక్తీకరణలను పరిశీలిద్దాం.

Updated : 01 Mar 2021 05:44 IST

ఇంగ్లిష్‌ దినపత్రికల శీర్షికల్లో, వార్తల్లో ఇటీవల తరచూ కనిపిస్తున్న ఓ రెండు వ్యక్తీకరణలను పరిశీలిద్దాం. వాటి అర్థం, వాక్యాల్లో ప్రయోగం తెలుసుకుందాం!

JAB

కొవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చిన సందర్భంలో ఈ పదాన్ని వార్తల్లో ఎక్కువగా వాడుతున్నారు. JAB అనే పదానికి అర్థం- సన్నని/ పదునైన వస్తువుతో వేగంగా, ఒత్తిడితో పొడవటం/ కొట్టటం. టీకా వేయించుకోవటం అనే అర్థంలో దీన్ని వాడుతున్నారు.
Norms set for COVID-19 jab in private hospitals. (ప్రైవేటు వైద్యశాలల్లో కొవిడ్‌-19 టీకా నిబంధనలను రూపొందించారు.)
The doctor jabbed the needle into his hand. (డాక్టరు సిరంజిని అతడి చేతికి గుచ్చారు.)
Did you have a flu jab this year? (ఫ్లూ టీకాను ఈ ఏడాది తీసుకున్నావా?)


JIBE

రాజకీయ నాయకులు వేరే పార్టీల నేతల తీరును హేళన చేస్తూ కటువైన విమర్శలు కురిపించే సందర్భంలో ఈ పదం వార్తల్లో కనిపిస్తుంటుంది. JIBE పదానికి హేళన/ అవమానించే వ్యంగ్య వ్యాఖ్య అని అర్థం.
Rahul takes a jibe at govt. over inflation (ద్రవ్యోల్బణం గురించి ప్రభుత్వంపై రాహుల్‌ వ్యంగ్యోక్తి.)
KTR takes jibe at Union govt., over soaring fuel prices (చమురు ధరల పెరుగుదలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్‌ వ్యంగ్య వ్యాఖ్య.)
K Palaniswami takes Jibe at Stalin, says ‘CM’s post not a commodity to buy’ (సీఎం పదవి కొనుక్కునే సరుకేమీ కాదు- స్టాలిన్‌పై కె.పళనిస్వామి వ్యంగ్య విమర్శ.)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని