Give an exam.. అనటం సరైనదేనా?
ఇంగ్లిష్ భాషను ఉపయోగించేటప్పుడు ఒకే రకంగా ఉన్న కొన్ని వ్యక్తీకరణల విషయంలో తికమక పడుతుంటాం. సరైన ప్రయోగం ఏదనే విషయంలో సందేహాలు వస్తుంటాయి...
ఇంగ్లిష్ భాషను ఉపయోగించేటప్పుడు ఒకే రకంగా ఉన్న కొన్ని వ్యక్తీకరణల విషయంలో తికమక పడుతుంటాం. సరైన ప్రయోగం ఏదనే విషయంలో సందేహాలు వస్తుంటాయి. అలాంటివి కొన్ని చూద్దాం; ప్రామాణిక రూపాలను తెలుసుకుందాం!
మిత్రులతో కలిసి ఏదైనా పని చేసినపుడు.. దాన్ని గురించి చెప్పే సందర్భంలో ఎవరిని ముందు చెప్పాలి? ఎవరిని తర్వాత చెప్పాలి?..ఈ అనుమానం వస్తుంటుంది. మనకంటే ముందు స్నేహితులను ప్రస్తావించమే మర్యాద. వ్యాకరణరీత్యా కూడా సరైనది.
Me and my friends (wrong)
my friends and I (correct)
My Friends and I went for dinner
నా స్నేహితులూ, నేనూ డిన్నర్‌కి వెళ్లాం.
Anyways (wrong) Anyway (correct)
Anyway, my driving isn't that bad.
ఏమైనా నా డ్రైవింగ్ అంత చెత్తగా ఏమీ ఉండదు.
Years back (wrong)
Years ago(correct)
He got a master's degree three years ago.
అతడు మూడేళ్ల క్రితం మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
Give an exam (wrong)..
Take an exam (correct)
They have to take an exam on tuesday.
వారు మంగళవారం పరీక్ష రాయాల్సివుంది.
Cope up (wrong)..
Cope with(correct)
She's struggling to cope with the heavy workload
మితిమీరిన పనిని తట్టుకోవడానికి ఆమె కష్టపడుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్‌కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు