Test the waters.. అంటే తెలుసా?

Test the waters.. వినగానే నీటిని పరిశీలించడం అనుకున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే! దానికో అర్థముంది. అదేంటో..

Published : 24 Jan 2019 00:35 IST

MODERN ENGLISH USAGE

Test the waters.. వినగానే నీటిని పరిశీలించడం అనుకున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే! దానికో అర్థముంది. అదేంటో.. దాన్ని వ్యక్తీకరణల్లో ఎలా ఉపయోగించొచ్చో తెలుసుకుందామా?

Test the waters.. అంటే తెలుసా?Srinivas: Are you going to the party that Rajaram is giving? If you are going whenwill you start?(రాజారాం ఇస్తున్న పార్టీకి నువ్వు వెళ్తున్నావా?)
Gopi: I am not sure if I am going. But then if I go, it is going to be a white tie affair. And right now I don’t have the formal dress that is required for the party. A good number of VIPs are coming to the party, and our dress should be quite formal. Are you attending the party?(నేనింకా వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నేను వెళ్లినా అది లాంఛనప్రాయమే. అయినా పార్టీకి అవసరమైన ఫార్మల్‌ బట్టలు కూడా నా దగ్గర లేవు. చాలామంది వీఐపీలు పార్టీకి వస్తున్నారు కాబట్టి, మన దుస్తులు కూడా ఫార్మల్‌వి అయ్యుండాలి. ఇంతకీ నువ్వు వెళ్తున్నావా పార్టీకి?)

Srinivas: I am not sure either. As it is tomorrow evening itself, I don’t have the formal dress to attend the party (నేనూ ఇంకా నిర్ణయించుకోలేదు. పార్టీ రేపు సాయంత్రమే. నా దగ్గర ఫార్మల్‌ దుస్తులేవీ లేవు)
Gopi: It is going to be a white tie affair. I am not sure if I have that kind of dress (అది చాలా ఖరీదైన బట్టలు వేసుకునే పార్టీ అవుతుంది. అలాంటి దుస్తులు నాకు లేవనుకుంటున్నా).

Srinivas: My opinion is that I had better avoid it. But I feel Rajaram might feel bad or let down if I do not attend the party (నా అభిప్రాయం ప్రకారం.. మనం ఆ పార్టీకి వెళ్లకుండా ఉండటమే మంచిది. కానీ మనం వెళ్లకపోతే రాజారాం వాడిని ముంచేసినట్లుగా భావిస్తాడేమో).
Gopi: I do feel so too. Any way I am going to buy a new suit and will attend the party (నేనూ అదే అనుకుంటున్నా. ఏదేమైనా ఓ కొత్త సూటు కొనుక్కొని పార్టీకి వెళ్లాలి అనుకుంటున్నా).

Srinivas: So will I. He is our closest friend and if we don’t attend the party, he may misread our intentions. He may think badly of us. We should attend the party and test the waters (నేనూ అదే అనుకుంటున్నా. అతను చాలా సన్నిహితమైన మిత్రుడు. మనం వెళ్లకపోతే అతను మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మనం ఆ పార్టీకి వెళ్లి, అక్కడ మిగతావాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి).
Gopi: OK, then. Let us attend the party (సరే అయితే. మనం ఆ పార్టీకి వెళదాం).

Look at the following sentences from the conversation

Test the waters.. అంటే తెలుసా?

1. But then if I go it is going to be a white tie affair Awhite tie affair = A context requiring a formal dress (లాంఛనప్రాయమైన బట్టలు వేసుకునే సందర్భం).
Dhanaraj: Are you attending the meeting tomorrow of the board of directors ofthe company? (రేపు జరిగే కంపెనీ డైరెక్టర్ల సమావేశానికి నువ్వు వెళ్తున్నావా?)

Bhagavan: I am not sure if I am attending the board meeting.It is going to be a white tie affair. I am afraid I cannot go in that kind of formal clothes. I had better avoid it (వెళ్లాలా వద్దా అనేది నేనింకా నిర్ణయించుకోలేదు. అది చాలా అట్టహాసంగా బట్టలు వేసుకుని వచ్చే వాళ్ల సమావేశం అవుతుంది. నాకలాంటి బట్టలు వేసుకుని వెళ్లాలనే ఉద్దేశం లేదు. నేను ఆ సమావేశానికి వెళ్లను).
 

2. We should attend the party and test the waters Test the waters = Find out what people’s opinions of something are before you ask them to do something (మనం ఇంకొకరిని ఏదైనా చేయమని అడిగేముందు వాళ్ల అభిప్రాయాలను తెలుసుకోవడం). 

Naresh: Are you attending the meeting that Chandrasekhar is going to organize? (చంద్రశేఖర్‌ నిర్వహించనున్న సమావేశానికి నువ్వు  వెళ్తున్నావా?)
Jagadeesh: I think I am. If we don’t go he may misunderstand us. I am going there to test the waters too (వెళ్లాలనే అనుకుంటున్నా. మనం వెళ్లకపోతే అతను మనల్ని అపార్థం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లి వాళ్ల అభిప్రాయాలను తెలుసుకుంటా. వాళ్లనేమైనా చేయమనే ముందు).


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని