వ్యక్తిగత విషయాలు నెట్‌లో పెడితే.. Doxing!

Doxing, heyday.. ఈ వ్యక్తీకరణలను ఎప్పుడైనా విన్నారా? ఇవి కొత్తగా వాడుకలోకి వస్తున్నాయి. వాటి అర్థం, సంభాషణల్లో వాటిని ఎలా ఉపయోగించవచ్చో ఉదాహరణల సాయంతో తెలుసుకుందామా?

Published : 28 Mar 2019 00:39 IST

MODERN ENGLISH USAGE

Doxing, heyday.. ఈ వ్యక్తీకరణలను ఎప్పుడైనా విన్నారా? ఇవి కొత్తగా వాడుకలోకి వస్తున్నాయి. వాటి అర్థం, సంభాషణల్లో వాటిని ఎలా ఉపయోగించవచ్చో ఉదాహరణల సాయంతో తెలుసుకుందామా?
Sriram: We cannot go there now. We have to be doxing the information about Sai on the internet. He feels he is too clever, and we have to curtail his freedom (మనం ఇప్పుడిక్కడికి వెళ్లలేం. మనం సాయిని గురించిన సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో పెడితే వాడికి గర్వం తగ్గుతుంది).
Janaki: That will be a big nuisance. He will not keep quiet if we do that. He will quarrel with us (అది పెద్ద చికాకుగా తయారవుతుంది. మనం ఆ పని చేస్తే అతను ఊరుకోడు. మనతో పోట్లాడతాడు).
Sriram: Let him do whatever he wants. I don’t care. He thinks he is too popular (వాడు ఏమైనా చేయనీ. నేను పెద్దగా పట్టించుకోను. వాడికి ప్రజాదరణ ఎక్కువగా ఉందనుకుంటాడు).
Janaki: He thinks no end of himself and that he is successful. We have to curtail that (తన విజయానికి ముగింపు లేదనుకుంటున్నాడు. దాన్ని మనం తగ్గించాలి).
Sriram: He thinks that he enjoys the heyday (తాను ఎక్కువగా విజయాన్ని అనుభవిస్తున్నానని వాడనుకుంటున్నాడు).
Janaki: That is something he does not remember.
He feels he is too successful and that there are no limits to is success (దాన్ని అతను పెద్దగా పట్టించుకోడు. తాను చాలా విజయం పొందుతున్నాడనీ, దానికి హద్దులే లేవనీ భావిస్తుంటాడు).
Sriram: Let him wallow in his success. What we are going to do will teach him a lesson అతన్ని తన విజయంలో పొర్లాడనీ. అతనికి మనం గుణపాఠం నేర్పించాలి).


 

Look at the following words from the conversation:

1) Doxing = Publish personal information on the internet అంతర్జాలంలో వ్యక్తిగత సమాచారాన్ని పెట్టడం).
a) Jayaram: Madhavarao has published all the information about Jayaram on the internet (మాధవరావు జయరామ్‌ గురించిన సమాచారాన్ని మొత్తం నెట్‌లో పెట్టేశాడు).
Viswanath: Why did he do that? Isn’t violating the privacy of Jayaram? Why did he do the doxing?(ఎందుకు చేశాడా పని? అది జయరాం వ్యక్తిగత విషయాలను బట్టబయలు చేయడం కదా?)
2) Heyday = a period of popularity and success (ప్రజాభిమానం, విజయం పొందే విషయం)
Venkata Rao: Our friend Vinayakumar is enjoying himself all happiness and thinks no end of himself (మన స్నేహితుడు వినయ్‌కుమార్‌ చక్కగా అనుభవిస్తున్నాడు, తన గురించి తాను చాలా సంతోషం పొందుతున్నాడు).
Krishna Rao: He is enjoying a heyday as he is very popular (అతనికేంటి? అతను చాలా ప్రజాభిమానం పొందుతూ చక్కగా అనుభవిస్తున్నాడు).


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని