‘తేజస్‌’ యుద్ధవిమానం దిగిన వాహన నౌక?

కేంద్ర స్థాయిలో జరిగేవైనా, రాష్ట్ర స్థాయిలో జరిగేవైనా పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!

Published : 20 Jan 2020 01:06 IST

పోటీపరీక్షల కోసం... వర్తమాన అంశాలు

కేంద్ర స్థాయిలో జరిగేవైనా, రాష్ట్ర స్థాయిలో జరిగేవైనా పోటీ పరీక్షల్లో వర్తమానాంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే వీటిని విద్యార్థులూ, ఉద్యోగార్థులూ ఎప్పటికప్పుడు గమనిస్తూ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం!
1. ఆభరణాల్లో బంగారం స్వచ్ఛతకు భరోసా ఇచ్చే హాల్‌ మార్కింగ్‌ నిబంధనలు ఏ రోజు నుంచి దేశంలో అమల్లోకి వచ్చాయి? (ఈ రోజు నుంచి ఏడాదిలోపు దుకాణదారులంతా హాల్‌ మార్కింగ్‌ లేని ఆభరణాలు విక్రయించుకోవాలనీ, లేదంటే తిరిగి కరిగించి కొత్త నిబంధనల ప్రకారం నగలు చేసి అమ్మాల్సి ఉంటుందనీ కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ వెల్లడించారు)
1) 2020 జనవరి 14   2) 2020 జనవరి 15   3) 2020 జనవరి 16   4) 2020 జనవరి 17
2. స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళం తయారుచేసిన తేజస్‌ యుద్ధ విమానం 2020 జనవరి 11న ఏ యుద్ధ విమాన వాహననౌకపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది? (దీంతో యుద్ధ విమాన వాహన నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతి కొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది).
1) ఐఎన్‌ఎస్‌ గరుడవేగ  
2) ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య
3) ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌   4) ఐఎన్‌ఎస్‌ విరాట్‌

3. భౌగోళిక, రాజకీయ అంశాలపై 2020 జనవరి 14, 15, 16 తేదీల్లో ప్రపంచస్థాయి ‘రైసినా డైలాగ్‌’ సదస్సును ఎక్కడ నిర్వహించారు? (ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వివిధ దేశాల మాజీ ప్రధానులు ఈ అంతర్జాతీయ సదస్సుకు హాజరై ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. ఇరాన్‌-అమెరికాల మధ్య ఉద్రిక్తత, అఫ్గానిస్థాన్‌లో శాంతి ప్రయత్నాలు, వాతావరణ మార్పులు వంటి వాటిపై చర్చించారు)
1) దిల్లీ 2) కోపెన్‌హెగెన్‌
3) వెల్లింగ్టన్‌ 4) న్యూయార్క్‌

జవాబులు: 1)3 2)2 3)1

- సీహెచ్‌. కృష్ణప్రసాద్‌

మిగతా వర్తమాన అంశాలను ‌్ర్ర్ర.’’-్చ్ట్య్ప౯్చ్మi్జ్త్చ.-’్మ లో చూడండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని