హిందువులు అంటే ఎవరు?

మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?

Updated : 22 Jan 2020 02:42 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు
ఇండియన్‌ పాలిటీ

ప్రాథమిక హక్కులు
1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?
1) ఆర్టికల్స్‌ 24 - 28   2) ఆర్టికల్స్‌ 25 - 28
3) ఆర్టికల్స్‌ 26 - 28   4) ఆర్టికల్స్‌ 26 - 29

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
1) ఆర్టికల్‌ 25   2) ఆర్టికల్‌ 26
3) ఆర్టికల్‌ 27   4) ఆర్టికల్‌ 28

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
4) పైవన్నీ  

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
1) ఆర్టికల్‌ 26   2) ఆర్టికల్‌ 27  
3) ఆర్టికల్‌ 28   4) ఆర్టికల్‌ 29

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
1) ఆర్టికల్‌ 27 2) ఆర్టికల్‌ 28  
3) ఆర్టికల్‌ 29 4) ఆర్టికల్‌ 30

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
1) హిందువులు  2) జైనులు, బౌద్ధులు
3) సిక్కులు    4) అందరూ

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
1) రామకృష్ణ మఠం, కంచి కామకోటి పీఠం  హిందూమతంలో ఉపశాఖ కిందికి వస్తాయి.
2) ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం
3) అరబిందో సొసైటీ మతం కిందకి రాదు
4) ఆర్యసమాజం మతం కిందకి రాదు.

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
1) ఆర్టికల్‌ 28 2) ఆర్టికల్‌ 27  
3) ఆర్టికల్‌ 26 4) ఆర్టికల్‌ 29

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
1) ఆర్టికల్‌ 28 2) ఆర్టికల్‌ 29  
3) ఆర్టికల్‌ 30 4) ఆర్టికల్‌ 31

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
1) మతపరమైన అల్పసంఖ్యాక వర్గం  
2) సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం
3) భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గం 4) 1, 2

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
1) జిల్లా   2) రాష్ట్రం   3) దేశం  4) ప్రాంతం
12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
1) రాష్ట్రం  2) ప్రాంతం  3) జిల్లా  4) దేశం
13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
1) ఆర్టికల్‌ 28 2) ఆర్టికల్‌ 29  
3) ఆర్టికల్‌ 30 4) ఆర్టికల్‌ 31

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
1) దీన్ని మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది.
2) దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.
3) 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించారు.  
4) ఇది రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్‌ 300్బత్శి లో ఒక సాధారణ చట్టబద్ధమైన హక్కుగా కొనసాగుతుంది.

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
1) కె.ఎం. మున్షీ 2) హిదయతుల్లా
3) కె.టి. షా 4) డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

సమాధానాలు
1-2; 2-1; 3-4; 4-2; 5-2; 6-4; 7-2; 8-4; 9-3;
10-4; 11-3; 12-1; 13-4; 14-2; 15-4;


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని