మనిషిని పోలిన రోబో.. వ్యోమ్‌మిత్ర!

భువన్‌ పంచాయత్‌ 3.0 అనే పోర్టల్‌ దేని ఆధారంగా పనిచేస్తుంది?...

Published : 13 Feb 2020 00:06 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు సైన్స్‌ & టెక్నాలజీ

మాదిరి ప్రశ్నలు

1. భువన్‌ పంచాయత్‌ 3.0 అనే పోర్టల్‌ దేని ఆధారంగా పనిచేస్తుంది?

1) శాటిలైట్‌ టెక్నాలజీ 2) ఇంటర్నెట్‌ టెక్నాలజీ

3) సూపర్‌ కంప్యూటింగ్‌ టెక్నాలజీ 4) టెలికమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ

2. 2020 జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో భారత రక్షణ రంగ సంస్థ డీఆర్‌డీవో ప్రదర్శించిన యాంటీ శాటిలైట్‌ ఆయుధ వ్యవస్థ A - SAT ను ఏ పేరుతో పరీక్షించారు?

1) మిషన్‌ శాటిలైట్‌ 2) మిషన్‌ శక్తి

3) ఆపరేషన్‌ శక్తి 4) మిషన్‌ థండర్‌

3. గగన్‌యాన్‌ యాత్రలో భాగంగా రోదసీలోకి పంపించేందుకు ఇస్రో రూపొందించిన మనిషిని పోలిన రోబో ఏది?

1) వ్యోమోనాట్‌ 2) వ్యోమ్‌ సాథి 3) వ్యోమ్‌మిత్ర 4) వ్యోమ్‌ కీర్తి

4. K - 4 తరహా క్షిపణులను ఎక్కడి నుంచి ప్రయోగిస్తారు?

1) సబ్‌మెరైన్లు 2) విమానాలు 3) మొబైల్‌ లాంచర్‌ 4) అన్నీ

5. ఇస్రో త్వరలో ప్రయోగించనున్న కొత్త తరహా రాకెట్‌ SSLV పూర్తి పేరు?

1) స్టేషనరీ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌

2) స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌

3) స్మాల్‌ స్టేషనరీ లాంచింగ్‌ వెహికల్‌

4) ఏదీకాదు

6. ఇటీవల ప్రయోగించిన జీశాట్‌ - 30 ఉపగ్రహం ఏ ఉపగ్రహ సేవలను భర్తీ చేయనుంది?

1) ఇన్‌శాట్‌ - 4ఎ 2) ఇన్‌శాట్‌ - 4బి

3) ఇన్‌శాట్‌ - 4సి 4) ఇన్‌శాట్‌ - 4సిఆర్‌

7. ‘యువ విజ్ఞాని కార్యక్రమ్‌’ (యువిక) ను చేపట్టే సంస్థ?

1) డీఆర్‌డీవో 2) ఐఐఎస్‌సీ - బెంగళూరు

3) బీహెచ్‌ఈఎల్‌ 4) ఇస్రో

సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-1; 5-2; 6-1; 7-4.

- దురిశెట్టి అనంత రామకృష్ణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని