నలందలో అరుదైన పీజీలు

పరిశోధనాత్మక విద్యకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నలంద యూనివర్సిటీ అరుదైన విభాగాల్లో కొన్ని  పీజీ కోర్సులను అందిస్తోంది.

Published : 05 Mar 2020 01:26 IST

పరిశోధనాత్మక విద్యకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నలంద యూనివర్సిటీ అరుదైన విభాగాల్లో కొన్ని  పీజీ కోర్సులను అందిస్తోంది. వాటిలో సస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, బుద్ధిస్ట్‌ స్టడీస్‌ తదితరాలు ఉన్నాయి.  వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో ‘జాతీయ ప్రాధాన్య సంస్థ’గా నలంద విశ్వవిద్యాలయం బిహార్‌లోని రాజ్‌గిర్‌లో 2010లో ఏర్పాటైంది. ఇక్కడి కోర్సుల్లోకి 17 భాగస్వామ్య దేశాల విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. మొత్తం విద్యార్థుల్లో 60 శాతం మంది విదేశీయులే. కోర్సులన్నింటినీ అంతర్జాతీయ దృక్పథంతో ఆసియా ఖండాన్ని దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నారు. వీటిలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. డిగ్రీ విద్యార్హతతో అడ్మిషన్‌ పొందవచ్చు.  
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ కోసం అదనంగా క్యాట్‌/ఎక్స్‌ఏటీ/మ్యాట్‌లో 70 పర్సంటైల్‌ తప్పనిసరి.
ఎంపిక విధానం: సెల్ఫ్‌ ఇంట్రడక్షన్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ (ఎస్‌ఓపీ)లను  దరఖాస్తుతో పంపాలి. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.
తరగతులు: కోర్సులకు ఎంపికైనవారికి ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రెసిడెన్షియల్‌ విధానంలో వీటిని నిర్వహిస్తున్నారు.


ఇవీ కోర్సులు

* ఎంబీఏ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
* మాస్టర్స్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌  ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌
* మాస్టర్స్‌ ఇన్‌ బుద్ధిస్ట్‌ స్టడీస్‌ ఫిలాసఫీ అండ్‌ కంపారిటివ్‌ రెలిజియన్‌
* మాస్టర్స్‌ ఇన్‌ హిస్టారికల్‌ స్టడీస్‌
* డిప్లొమా, సర్టిఫికెట్‌: సంస్కృతం, ఇంగ్లిష్‌, పాలీ, టిబెటన్‌, కొరియన్‌
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2020
వెబ్‌సైట్‌:
  https://nalandauniv.edu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని