ముగిసే సంఖ్యల ముచ్చట

పోటీ పరీక్షల్లో.. ముఖ్యంగా బ్యాంకు నియామక పరీక్షల్లో వచ్చే సింప్లిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌ ప్రశ్నల్లో సంఖ్యల వర్గాలను కనుక్కోవలసివస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో చేయటం మొదలుపెడితే సమయం సరిపోదు.

Updated : 30 Aug 2021 06:32 IST

పోటీ పరీక్షల్లో.. ముఖ్యంగా బ్యాంకు నియామక పరీక్షల్లో వచ్చే సింప్లిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌ ప్రశ్నల్లో సంఖ్యల వర్గాలను కనుక్కోవలసి వస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో చేయటం మొదలుపెడితే సమయం సరిపోదు. అందుకే స్పీడ్‌ మ్యాథ్స్‌ మెలకువలు తెలుసుకోవాలి. అలాంటి కొన్ని పద్ధతుల గురించి తెలుసుకుందాం.


‘2’తో ముగిసే సంఖ్యల వర్గం

పద్ధతిలో ‘2’తో ముగిసే ఏ సంఖ్యకైనా వర్గాన్ని తేలికగా తెలుసుకోవచ్చు.

ముందుగా ఇచ్చిన సంఖ్యలో నుంచి ‘2’ తీసివేస్తే ‘0’తో ముగిసే సంఖ్య వస్తుంది. ఆ వచ్చిన సంఖ్యకు వర్గాన్ని తెలుసుకోవాలి.

ఆ తర్వాత ఇచ్చిన సంఖ్యను, దానిలో నుంచి ‘2’ తీసివేస్తే వచ్చిన సంఖ్యను కలిపి ఆ ఫలితాన్ని రెట్టింపు చేయాలి. అలా వచ్చిన సంఖ్యను ఇంతకుమందు కనుక్కున్న వర్గానికి కలిపితే జవాబు వస్తుంది.

ఉదాహరణకు 322
ముందుగా 32లో నుంచి 2 తీసివేస్తే 30 వస్తుంది. దీనికి వర్గాన్ని తీసుకోవాలి.  
30
2 = 900
తర్వాత 32, 30లను కలపాలి.
32 + 30 = 62
దీన్ని రెట్టింపు చేస్తే (62´X2) = 124 వస్తుంది.
దీన్ని 900కు కలపాలి.
900 + 124 = 1024 జవాబు. 32
2 = 1024
‘2’తో ముగిసే ఏ సంఖ్యకైనా ఇలా వర్గాన్ని తెలుసుకోవచ్చు.


‘3’తో ముగిసే సంఖ్యల వర్గం

చ్చిన సంఖ్యలో నుంచి ‘3’ తీసివేసి.. ఆ వచ్చిన సంఖ్యకు వర్గాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన సంఖ్యను, దానిలో నుంచి ‘3’ తీసివేస్తే వచ్చిన సంఖ్యను కలిపి ఆ ఫలితాన్ని 3 రెట్లు చేయాలి. ఆ వచ్చిన సంఖ్యను ఇంతకుముందు తెలుసుకున్న వర్గానికి కలిపితే జవాబు వస్తుంది.

ఉదాహరణకు 532

53లో నుంచి 3 తీసివేస్తే 50 వస్తుంది. దీనికి వర్గం (502) తీసుకుంటే 2500 వస్తుంది.
తర్వాత 53, 50లను కలిపితే...
53 + 50 = 103 వస్తుంది.
దీన్ని మూడు రెట్లు చేస్తే
103X´3 = 309 అవుతుంది.
దీన్ని 2500కు కలిపితే జవాబు వస్తుంది
2500 + 309 = 2809
53
2 = 2809


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని