Free gift..  అనే పదబంధం సరైనదేనా?

చెప్పిన విషయాలే మళ్లీమళ్లీ చెపుతుంటే వినటం ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది. ఒకే రకమైన అర్థాన్నిచ్చే రెండు పదాలను పక్కపక్కనే చెప్పటం, రాయటం, అదనపు మాటలను అనవసరంగా ఉపయోగించటం.. వీటిని తగ్గించుకోవాలి...

Published : 20 Oct 2021 22:38 IST

చెప్పిన విషయాలే మళ్లీమళ్లీ చెపుతుంటే వినటం ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది. ఒకే రకమైన అర్థాన్నిచ్చే రెండు పదాలను పక్కపక్కనే చెప్పటం, రాయటం, అదనపు మాటలను అనవసరంగా ఉపయోగించటం.. వీటిని తగ్గించుకోవాలి. అప్పుడే మన సంభాషణలూ, రాతలూ సూటిగా, అర్థవంతంగా ఉంటాయి.

Free gift
ఈ పదబంధాన్ని చాలామంది తరచూ వాడుతుంటారు. ‘ఇది కరెక్టే కదా?’ అనిపిస్తోంది కదూ? కానీ ఆలోచించండి- గిఫ్ట్‌ అంటే ఉచితంగా ఇచ్చేది. మరి ఈ మాటకు ముందు ‘ఫ్రీ’ అని జోడించటంలో అర్థమేమీ లేదని గ్రహించాలి. అందుకని gift అని చెప్తే చాలు.
ఇలాంటి మరో పదబంధం..

Current trend
ట్రెండ్‌ అనేదే ఇప్పటి ధోరణినీ, పరిస్థితినీ తెలియజేసేది. ఈ మాటకు ముందు ‘ప్రెజెంట్‌’ మళ్లీ ప్రత్యేకంగా చెప్పటం పునరుక్తి అవుతుంది. కాబట్టి trend  అంటే సరిపోతుంది.
ఇలాంటి పునరుక్తులున్న పదబంధాలు


మరికొన్ని చూద్దాం.

Advance planning
Advance warning
Advance reservation

వీటిలో Advance అనే పదం అనవసరం. ఆ మాట లేకపోయినా దాని అర్థం స్ఫురిస్తుంది.

Basic necessities
Basic fundamentals
Basic essentials

ఈ మూడిట్లోనూ Basic అనే మాట వాడకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు.Basic అనే పదం వాడితే వచ్చే అర్థమే ఈ మాటల్లోనూ వస్తుంది.

Necessities
Fundamentals
Essentials

కింది పదబంధాల్లో మొదటి పదం Completely  వాడకపోయినా మనం ఉద్దేశించిన అర్థం వస్తుంది. కాబట్టి దాన్ని వాడాల్సిన అవసరం లేదు.

Completely surrounded
Completely filled
Completely finished


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు