ధీమా తగ్గిపోనీయొద్దు!

పరీక్షల ముందు ఆలోచనా విధానంలో మెల్లగా మార్పు వస్తుంటుంది. అప్పటివరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్లకు కూడా ధీమా సన్నగిల్లుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాలంటే...?

Updated : 04 Apr 2022 06:40 IST

పరీక్షల ముందు ఆలోచనా విధానంలో మెల్లగా మార్పు వస్తుంటుంది. అప్పటివరకు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నవాళ్లకు కూడా ధీమా సన్నగిల్లుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో నమ్మకాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్లాలంటే...?

నమ్మకాన్ని పెంచుకోవడానికి చక్కని సన్నద్ధతను మించిన మార్గం లేదు. ఏ సబ్జెక్టుకు ఎంత సమయం అవసరమో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రణాళిక వేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలి.


చదివిన అంశాన్ని ఒకసారి చూడకుండా రాసుకుంటే స్వీయ సమర్థతను సరిగా అంచనా వేసుకోవచ్చు. సరిగా రాయలేకపోతే మళ్లీ చదివి రాయొచ్చు. ఇలా చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


* చదువుతున్న అంశంలోని ముఖ్యాంశాలను నోట్స్‌లో రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. వీటిని పరీక్షల ముందు ఒకసారి చదువుకుంటే సమయం ఆదా అవుతుంది.

* చదివిన విషయాలను స్నేహితులతో చర్చించడం వల్ల అవి బాగా అర్థమవుతాయి. అంతేకాదు ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి కూడా.

* మీరు ఏమేం చదివారు, పరీక్షల్లో అవన్నీ వస్తాయా రావా అనే విషయాల గురించి చర్చించడం మానేయాలి. ఇప్పటివరకు సాగించిన సన్నద్ధత మీద నమ్మకం ఉంచాలి.

* పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో సానుకూల దృక్పథం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏకాగ్రత పెరిగి చదివిన విషయాలను సమీక్షించుకోవడానికి ఈ దృక్పథం ఎంతో తోడ్పడుతుంది.

* తగినన్ని నీళ్లు తాగడం, పోషకాహారం తీసుకోవడం మర్చిపోకూడదు. శరీరం అలసటగా, నీరసంగా ఉండి.. ఆరోగ్యం సరిగా లేకపోతే ఏమైనా సాధించగలరనే నమ్మకం మెల్లగా తగ్గిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని